• October 2, 2024

మతపరమైన ఉత్సవాలు, ఊరేగింపుల్లో డీజేల నిషేధం

పండగైనా, పబ్బమైనా.. పెళ్లిలైనా.. పేరంటాలైనా.. వేడుక ఎలాంటిదై నా.. అక్కడ డీజే మోతలు మోగడం పరిపాటిగా మారింది. డీజేలేనిదే దావత్‌కు అర్థమేలేదన్నట్లు పరిస్థితులు తయారయ్యాయి. మజా కోసం…

 మతపరమైన ఉత్సవాలు, ఊరేగింపుల్లో డీజేల నిషేధం

పండగైనా, పబ్బమైనా.. పెళ్లిలైనా.. పేరంటాలైనా.. వేడుక ఎలాంటిదై నా.. అక్కడ డీజే మోతలు మోగడం పరిపాటిగా మారింది. డీజేలేనిదే దావత్‌కు అర్థమేలేదన్నట్లు పరిస్థితులు తయారయ్యాయి. మజా కోసం మొదలైన ఈ డీజే సంస్కృతితో.. మరణాలు సంభవిస్తుండటంతో పోలీసులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. డీజే మితిమీరిన శబ్దాలతో పసిపిల్లలు, యువకులకు కూడా గుండెపోట్లు వస్తుండటం, కర్ణభేరులు దెబ్బతింటుండటంతో నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. ఇక నుంచి అన్ని రకాల మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజేల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. డీజే సౌండ్లు, ఫైర్‌క్రాకర్స్‌ కారణంగా విపరీతమైన శబ్ద కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో వాటి నిషేధంపై కీలక నిర్ణయిం తీసుకున్నట్లు సీపీ ఓ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply