సాహిత్యం

యుగాది…ఉగాది!

యుగానికి ఆరంభం…జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పబడింది. దీని ప్రకారం ఈఏడాది మార్చి 30వ తేదీ చైత్ర శుక్ల పాడ్యమి రోజున శ్రీక్రోధి నామ సంవత్సరం ముగిసి, శ్రీ విశ్వావసు నామ
Read More

సంగీతంలో మామ మహదేవన్

దక్షిణాది సినీరంగంలో మామగా చిరపరిచితులైన కెవి మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్. మామ తొలుత సహాయనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించి, మిత్రుల సలహాతో సంగీత దర్శకుడిగా మారి ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. 1962 లో విడుదలైన మంచి మనసులు సినిమాలో ఈయన స్వరపరిచిన మామ మామ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి మామ అనేది ముద్దుపేరుగా స్థిరపడింది. తెలుగు రాకపోయినా మామ తెలుగు
Read More

ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు

ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు రామారావు. 1963 నుంచి రామారావు కొన్నాళ్లు రాజమహేంద్రవరంలో నివసించారు. 1974 వరకు స్థానికి గురుకులంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన పైలట్ హోదాలో 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో ఆయన ఆచూకీ
Read More

ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య

కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే ప్రేక్షకులు, శ్రోతలు మైమరిచిపోయేవారు. అందుకే ఆయన పేరు వెంకట సుబ్బయ్య కాస్తా ఈల పాట రఘురామయ్యగా మారింది. రఘురామయ్య పేరు వెనుక కూడా ఒక విశేషం ఉంది. ఆయన నాటకాల్లో రఘురాముని పాత్రలు ఎక్కువగా వేయడంతో స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు
Read More

తిట్టు…కొట్టు పదవులు పట్టు….ఆలోచింపజేసే టిడిపి నేత డొక్కా ఆవేదన!

రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి, వైసిపి నుంచి టిడిపిలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. నేటి రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రచయిత, తెలంగాణా సిఎల్పీ ఉద్యోగి శ్రీపాద శ్రీనివాస్ విభిన్న అంశాల సమాహారంతో రచించిన అంతరంగం పుస్తకావిష్కరణ సభ రాజమహేంద్రవరంలోని ధర్మంచర బుక్ బ్యాంకులో జరిగింది. ఈకార్యక్రమంలో డొక్కా, తెలంగాణాలోని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్
Read More

అల్లు రామలింగయ్యను వెలుగులోకి తెచ్చింది రాజమహేంద్రవరం వాసే!

ప్రముఖ సినీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య చిత్రసీమలో లేకపోతే మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆయన తనయుడు ఐకాన్ స్టార్ అర్జున్ వంటి వారు బహుశా వెలుగులోకి వచ్చేవారు కాదేమో. మెగాస్టార్ కాంపౌండ్ ఉండేదీ కాదేమో.. మెగాస్టార్, ఐకాన్ స్టార్ లకు వెన్నుముకగా నిలిచిన అల్లు రామలింగయ్యకు వెన్నుముకగా నిలిచిన వ్యక్తి రాజమహేంద్రవరంనకు చెందిన డాక్టర్ గరికపాటి రాజారావు. రామలింగయ్యతో పాటు, జమున,
Read More

యుగపురుషుడు వివేకానందుడు!

స్వామి వివేకానంద.  ఆ పేరు వింటేనే ఒక జాగృతి. సుప్తచేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాక, హిందూమత గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. రామకృష్ణ మఠాన్నిస్థాపించి భారతదేశంలో సామాజిక సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో యువతకు దిశానిర్ధేశం చేశారు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటి నుంచే ఆయనలో నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. వివేకానందుడి అసలు పేరు నరేంద్ర నాథుడు.
Read More

గాన గంధర్వన్ ఏసుదాసు

ఆకాశదేశాన…..హరివరాసనం లాంటి  చిరస్థాయిగా నిలిచే పాటలు..వైవిధ్యమైన కంఠస్వరం…మార్థవమైన గాత్రం కెజె యేసుదాసు సొంతం. సినీగీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీనుల విందే. అందుకే ఆయనను గాన గంధర్వన్ అని పిలుస్తారు. యేసుదాసు పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్.  ఐదు దశాబ్దాలుగా  పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప  మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా తదితర భారతీయ భాషలతో పాటు అరబిక్,
Read More

రాజమహేంద్రవరంలో విధుశేఖర భారతీ మహాస్వామి విజయ ధర్మయాత్ర

సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంతశ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఈనెల 26నుంచి 29వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో విజయధర్మయాత్ర చేపట్టనున్నారు. గోదావరి గట్టున ఉన్న శ్రీశృంగేరి శంకర మఠం, శ్రీ త్యాగ రామనారాయణ దాస సేవా
Read More

డిగ్రీల్లో అర్థశతకం సాధించిన నిత్యవిద్యార్థి….శతకం దిశగా ప్రస్థానం!

కర్రి రామారెడ్డి పేరు చెబితేనే ఎన్నో విశేషణాలతో పాటు, వెనుక సంవత్సరానికి కొన్ని చొప్పున డిగ్రీలు, డాక్టరేట్లు తగిలించాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరంనకు చెందిన నిత్యవిద్యార్థి,  ప్రముఖ మానసిక వైద్యులు, డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి డిగ్రీల పరంపరలో మరో మైలురాయిని అధిగమించారు. తాజాగా దేశంలోని ప్రముఖ ఐఐటిలతో కూడిన ఎన్ పిటెల్, ఎన్ పిటెల్ ప్లస్ నిర్వహించే పరీక్షల్లో ఒకే సెమిస్టర్ లో 13
Read More