అందరివాడు మన అమాత్యుడు!
కందుల దుర్గేష్ ..పార్టీలు… కులమతాలకు అతీతంగా అందరివాడుగా గుర్తింపు పొందారు. అందుకే గత ఎన్నికల్లో తనదికాని నిడదవోలు లో ఎమ్మెల్యేగా గెలిచి.. జనసేన కోటాలో మంత్రి అయ్యారు.…

కందుల దుర్గేష్ ..పార్టీలు… కులమతాలకు అతీతంగా అందరివాడుగా గుర్తింపు పొందారు. అందుకే గత ఎన్నికల్లో తనదికాని నిడదవోలు లో ఎమ్మెల్యేగా గెలిచి.. జనసేన కోటాలో మంత్రి అయ్యారు. ఒక ఎమ్మెల్యేను కలవడమే ఈరోజుల్లో గొప్ప అనుకుంటే మంత్రంటే మాటలా.. మందీ మార్బలంతో ఉండే అమాత్యుని కలవాలంటే ఆషామాషీ కాదు. సామాన్యులకైతే మరీ కష్టం.. అయితే దుర్గేష్ విషయంలో అలాంటి పరిమితులు లేవనేందుకు ఆదివారం నాటి సంఘటనే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తన సాయం కోసం వచ్చిన ఓ వృద్ధుడ్ని దుర్గేష్ ఆప్యాయంగా పలకరించడంతో పాటు, ఆర్థిక సాయం చేశారు. అధికారిక కార్యక్రమాలకు బయటకు వెళ్తూ మూలన నిల్చొన్న 82 సంవత్సరాల పెద్దాయనను పలకరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేసి రూరల్ మండలo లోని ఆవ ప్రాంతానికి చెందిన కారుమూరి నాగ విశ్వనాథం గాంధీ జయంతి, వర్థంతుల సందర్భంగా గాంధీ వేషాదరణలో ప్రత్యేకంగా కనిపించేవారు. ఆదివారం ఆయన మంత్రి కి తన కష్టం చెప్పుకునే లోపే గుర్తించడంతో పాటు, మందులు వేసుకుంటున్నారా లేదా అని ఆప్యాయంగా ఆరా తీసి తన జేబులోంచి కొంత ఆర్థిక సాయం చేసి మంత్రి కందుల దుర్గేష్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎన్నో కష్టనష్టాలు ఓర్చి, విలువైన ఆస్తులను కోల్పోయి మంత్రిగా ఎదిగిన నాయకుడు దుర్గేష్ అని ఈసందర్భంగా విశ్వనాధంచెప్పుకొచ్చారు.