సాహిత్యం

తిట్టు…కొట్టు పదవులు పట్టు….ఆలోచింపజేసే టిడిపి నేత డొక్కా ఆవేదన!

రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి, వైసిపి నుంచి టిడిపిలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. నేటి రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రచయిత, తెలంగాణా సిఎల్పీ ఉద్యోగి శ్రీపాద శ్రీనివాస్ విభిన్న అంశాల సమాహారంతో రచించిన అంతరంగం పుస్తకావిష్కరణ సభ రాజమహేంద్రవరంలోని ధర్మంచర బుక్ బ్యాంకులో జరిగింది. ఈకార్యక్రమంలో డొక్కా, తెలంగాణాలోని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్
Read More

అల్లు రామలింగయ్యను వెలుగులోకి తెచ్చింది రాజమహేంద్రవరం వాసే!

ప్రముఖ సినీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య చిత్రసీమలో లేకపోతే మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆయన తనయుడు ఐకాన్ స్టార్ అర్జున్ వంటి వారు బహుశా వెలుగులోకి వచ్చేవారు కాదేమో. మెగాస్టార్ కాంపౌండ్ ఉండేదీ కాదేమో.. మెగాస్టార్, ఐకాన్ స్టార్ లకు వెన్నుముకగా నిలిచిన అల్లు రామలింగయ్యకు వెన్నుముకగా నిలిచిన వ్యక్తి రాజమహేంద్రవరంనకు చెందిన డాక్టర్ గరికపాటి రాజారావు. రామలింగయ్యతో పాటు, జమున,
Read More

యుగపురుషుడు వివేకానందుడు!

స్వామి వివేకానంద.  ఆ పేరు వింటేనే ఒక జాగృతి. సుప్తచేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాక, హిందూమత గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. రామకృష్ణ మఠాన్నిస్థాపించి భారతదేశంలో సామాజిక సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో యువతకు దిశానిర్ధేశం చేశారు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటి నుంచే ఆయనలో నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. వివేకానందుడి అసలు పేరు నరేంద్ర నాథుడు.
Read More

గాన గంధర్వన్ ఏసుదాసు

ఆకాశదేశాన…..హరివరాసనం లాంటి  చిరస్థాయిగా నిలిచే పాటలు..వైవిధ్యమైన కంఠస్వరం…మార్థవమైన గాత్రం కెజె యేసుదాసు సొంతం. సినీగీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీనుల విందే. అందుకే ఆయనను గాన గంధర్వన్ అని పిలుస్తారు. యేసుదాసు పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్.  ఐదు దశాబ్దాలుగా  పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప  మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా తదితర భారతీయ భాషలతో పాటు అరబిక్,
Read More

రాజమహేంద్రవరంలో విధుశేఖర భారతీ మహాస్వామి విజయ ధర్మయాత్ర

సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంతశ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఈనెల 26నుంచి 29వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో విజయధర్మయాత్ర చేపట్టనున్నారు. గోదావరి గట్టున ఉన్న శ్రీశృంగేరి శంకర మఠం, శ్రీ త్యాగ రామనారాయణ దాస సేవా
Read More

డిగ్రీల్లో అర్థశతకం సాధించిన నిత్యవిద్యార్థి….శతకం దిశగా ప్రస్థానం!

కర్రి రామారెడ్డి పేరు చెబితేనే ఎన్నో విశేషణాలతో పాటు, వెనుక సంవత్సరానికి కొన్ని చొప్పున డిగ్రీలు, డాక్టరేట్లు తగిలించాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరంనకు చెందిన నిత్యవిద్యార్థి,  ప్రముఖ మానసిక వైద్యులు, డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి డిగ్రీల పరంపరలో మరో మైలురాయిని అధిగమించారు. తాజాగా దేశంలోని ప్రముఖ ఐఐటిలతో కూడిన ఎన్ పిటెల్, ఎన్ పిటెల్ ప్లస్ నిర్వహించే పరీక్షల్లో ఒకే సెమిస్టర్ లో 13
Read More

గోదావరితీరంలో ఆధ్యాత్మిక సంరంభం…కార్తిక లక్ష దీపోత్సవం

పురాణాల ప్రకారం కార్తికమాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అందులోనూ సోమవారం శివునికి ఇష్టమైన రోజు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరితీరంలోని చారిత్రాత్మక కోటిలింగాలరేవు వద్ద దాదాపు 11 ఏళ్ల క్రితం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు రాజకీయాలకు అతీతంగా లక్ష దీపోత్సవానికి శ్రీకారం చుట్టి ఆధ్యాత్మిక సంరంభానికి నాంది పలికారు. కరోనా సమయంలో కూడా అంతరాయం లేకుండా నిరాటంకంగా సాగుతున్న దీపోత్సవం ప్రతీ ఏటా కార్తిక మాసంలో
Read More