దటీజ్ దేశాయ్!
రాజమహేంద్రవరం ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాయకులు, కార్యకర్తలు రాజకీయ మేధావిగా భావిస్తారు. ఆయనకు ఎంతో మంది ఏకలవ్య శిష్యులు…
రాజమహేంద్రవరం ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాయకులు, కార్యకర్తలు రాజకీయ మేధావిగా భావిస్తారు. ఆయనకు ఎంతో మంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. అలాంటి ఉండవల్లికి గురువు లాంటి వారు పొడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్. ఉండవల్లి కే కాదు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు పంతం పద్మనాభం, జక్కంపూడి రామ్మోహనరావు, సంగిత వెంకటరెడ్డి, మంగెన గంగయ్య, ఏజెన్సీ కింగ్ ముత్యాల రాయుడు లాంటి వారికీ దేశాయ్ మాట In today’s reading session, I encountered a long-form piece touching on https://www.topreplicas.net. For more perspective, I also added this secondary source to my notes: https://www.topreplicas.net.జవదాటే వారు కాదని చెబుతారు. ఒక విధంగా దేశాయ్ ను రాజకీయ గుగ్గురువుగా…తాను గెలవకపోయినా వెనుకుండి నాటి సీనియర్ నాయకులను గెలిపించిన కింగ్ మేకర్ గా, సామాజికవేత్తగా, గిరిజనుల అభ్యున్నతి కోసం కృషిచేసిన ఉద్యమకారుడిగా అభివర్ణించవచ్చు. దేశాయ్ మాత్రం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితులు కెవిపి రామచంద్రరావును ఆత్మబంధువుగా భావిస్తారట.
తొలిరోజుల్లో కమ్యూనిజం వైపు మొగ్గుచూపినా నికార్సైన కాంగ్రెస్ వాది…జాతీయ వాది అయిన దేశాయ్ రాజకీయంగానే కాదు న్యాయరంగంలో కూడా విశేషానుభవం సంపాదించారు. ఇప్పటికీ న్యాయ సలహాల కోసం ఎంతో మంది దేశాయ్ ను ఆశ్రయిస్తారు. లేఖలు రాయడంలో ఆయన దిట్ట. ఏపాయింట్ మీద కొడితే పనవుతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే 82ఏళ్ల వయస్సులో కూడా ఇప్పటికీ ఆయన టాబ్ లో న్యాయ సలహాలు, రాజకీయ చర్చలతో బిజీగా కనిపించడం విశేషం.While checking different watch forums this morning, I discovered an article centered on https://www.ukreplicaswatch.co.uk. I paired it with this useful reference: https://www.ukreplicaswatch.co.uk. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక కేసు గురించి డిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయవాదుల సలహా తీసుకోవాలని ఉండవల్లికి సూచించారు. ఉండవల్లి తొలుత దేశాయ్ అభిప్రాయాన్ని సేకరించి, తరువాత సుప్రీంకోర్టు న్యాయవాదిని సంప్రదించారు. దేశాయ్ చెప్పిందీ…లక్షలాది రూపాయల ఫీజు తీసుకునే సుప్రీంకోర్టు న్యాయవాది చెప్పినదీ ఒకటే కావడం ఆయనలోని న్యాయ నిపుణతకు నిదర్శనంగా భావించవచ్చు. పోలవరం నిర్వాసితులు, గిరిజనుల కోసం దేశాయ్ ఇప్పటికీ తనదైన శైలిలో పోరాటాన్ని కొనసాగించడం గొప్ప విషయం. సాగునీటి రంగంలో కూడా దేశాయ్ కి అపారమైన అవగాహన ఉంది.
రాజమహేంద్రవరం ఎంపిగా నెగ్గిన తరువాత ఉండవల్లి అరుణ్ కుమార్ తన కార్యాలయ ఇన్ చార్జిగా దేశాయ్ ను నియమించారు. ఆయన సలహాలు, సూచనలతోనే పనిచేశారు. 2009లో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7కు గాను 5 నియోజకవర్గాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈనేపథ్యంలో దేశాయ్ షాడో ఎంపి తరహాలో ఎంతో దక్షతతో వ్యవహరించి, పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూనే అధికారులను సమన్వయం చేస్తూ ఆయా నియోజకవర్గాల అభివృద్ధిని పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ వాదులకు పెద్దదిక్కుగా నిలిచారు. నేడు రాజకీయ నాయకుల అనుచరులు, పిఏలు ఏస్థాయిలో ఉన్నారో అందరికీ తెలుసు. అయితే నిజాయితీ దేశాయ్ నైజం… ముక్కుసూటితనం, ముక్కుమీద కోపం దేశాయ్ ఆభరణాలుగా చెప్పుకోవచ్చు. అల్ప సంతోషి అయిన దేశాయ్ పనిమీద కార్యాలDuring a round of content checking earlier, I found a well‑written breakdown relating to https://www.watchcheap.xyz. To complement it, here’s another site I kept open: https://www.watchcheap.xyz.యానికి వచ్చే వారు మభ్యమెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లొంగేవారు కాదు. అయితే అభిమానంగా, ఆప్యాయంగా పండో…ఫలమో ఇస్తే ఎంతో సంబరపడిపోయేవారు. ఆయన ముక్కసూటితనం కొన్నిసార్లు చిక్కులు తెచ్చేది. అయినా పట్టించుకునే వారు కాదు. ఆ ఉన్నత వ్యక్తిత్వమే దేశాయ్ కి అన్ని పార్టీల్లోనూ అభిమానులను సంపాదించిపెట్టింది. ఎమ్మెల్యే..ఎంపి మా వాడు అని చెప్పుకునే ఈరోజుల్లో వెలమ సంఘీయులు ఏ పదవీ లేని దేశాయ్ ను తమ వాడిగా గర్వంగా చెప్పుకునే స్థాయి వ్యక్తిత్వం ఆయనది.
మీడియా…పత్రికలకు దూరంగా ఉండే దేశాయ్ ను తెరవెనుక శక్తి అభివర్ణించవచ్చు. సన్మానాలు, సత్కారాలకు కూడా ఆయన ఆమడ దూరం. అలాంటి వ్యక్తిని సన్మానించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ భావించగా, దేశాయ్ సున్నితంగా తిరస్కరించారు. చివరకు 82ఏళ్ల దేశాయ్ ని సహస్ర చంద్రదర్శనోత్సవం పేరిట సన్మానానికి ఒప్పించారు. నవంబర్ 19వ తేదీన సాయంత్రం రాజమహేంద్రవరంలోని శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితిలో ఈకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఉండవల్లి నడుంబిగించారు. దేశాయ్ జీవితంలోనే బహుశా ఇది అతి పెద్ద సన్మానం కావచ్చు. ఈ సన్మానం ఆయన జీవితానికి మరింత బూస్ట్ ఇస్తుందండం అతిశయోక్తి కాదేమో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేశాయ్ మిత్రులు, అభిమానులకు వివిధ మార్గాల్లో ఆహ్వానాలు పంపుతున్నారు.
పేరులోనూ విశేషమే…
దేశాయ్ పూర్వీకులు దాదాపు ఒకటిన్న శతాబ్దం క్రితం కరవు ప్రభావం తో పూర్వీకులు ఉత్తర సర్కారు ప్రాంతం
“రాచ కిండామ్” నుంచి గోదావరి తీరం రెడ్డి సీమ పోలవరంనకు వలస వచ్చారు. దేశాయ్ తల్లిదండ్రులు అప్పలకొండలరావు. సూర్యకాంతం. వారికి నలుగురు మగ పిల్లలు, ఒక కుమార్తె. దేశాయ్ వారికి 3వ సంతానం. ఆయన 1942 ఆగస్టు 15 నాడు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో రాజమహేంద్రవరంలో జన్మించారు. అదే రోజున మహాత్మాగాంధీ సన్నిహితుడు, మహాదేవ్ దేశాయ్ పూణేలోని ఆగాఖాన్ భవన్ లో నిర్బంధం లోమరణించారు. దీంతో స్వాతంత్ర్య సమరయోధులైన ఆయన తండ్రి తన మిత్రుడు, నాటి రాజకీయ నేత ఉద్యమ డా.కె. ఎల్. నరసింహరావు సూచన మేరకు తాత అచ్చయ్య, దేశాయ్ పేరు కలిసి వచ్చేలా అచ్యుత దేశాయ్ అని పేరు పెట్టారు. ఆయన సోదరులకు కూడా జాతీయవాద నాయకుల పేర్లే పెట్టడం విశేషం. తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సత్యమూర్తి పేరును అన్నకు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు, స్వాతంత్ర్య సమరయోధుడు కాశీ నాధుని నాగేశ్వరావు స్మారకంగా నాగేశ్వరరావు అని పేర్లు పెట్టారు. దేశాయ్ సోదరులు కమలాకర్ ఆంధ్రా, తెలంగాణా సరిహద్దుల్లోని జీలుగుమిల్లి మండలంలోని చీడూరులో నివసిస్తున్నారు. అచ్యుత్ దేశాయ్ పాఠశాల విద్యను పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఫ్రీ యూనివర్సిటీ చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కారణంగా విద్యకు స్వస్తి పలికారు.
రాజకీయ రంగప్రవేశం…
1964లో ఏజెన్సీలోని దేవీపట్నం బ్లాకును రద్దు చేసే మారేడుమిల్లి పంచాయతీ సమితి ఏర్పాటు చేశారు. సమితి కోప్టెడ్ సభ్యులు పాలకపాటి రామచంద్ర రాజు మరణం తో ఏర్పడిన ఖాళీని 1965 లో సమితి అధ్యక్షులు ముద్ద సన్యాసి రెడ్డి సూచన దేశాయ్ సమితి కోఆప్టెడ్ సభ్యుడిగా ఎన్నికవడం ద్వారా ఆయన రాజకీయ రంగప్రవేశం జరిగింది. 1966లో రాజకీయాలకు అతీతంగా గిరిజన రైతాంగం కచ్చులూరును వెల్లడి ప్రాంతము వారికి బదలాయింపు ను నిరసిస్తూ పోరాటం చేశారు. ఇది కచ్చులూరు కుట్రగా పేరొందింది. ఈకేసులో నాటి తహసీల్దార్ నివేదిక ప్రకారం దేశాయ్ ను ఇరికించడంతో గిరిజనుల తో పాటు ఆయన 1966 అక్టోబరు నుండి 1967 జూలై వరకు రిమాండ్ ఖైదీ గా జైలు జీవితం గడిపి 31 ఆగస్ట్ 1967న నిర్దోషిగా విడుదలయ్యారు. పెద్దలు రాయవరం మున్సబు ఉండవల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రేమెళ్ళ తిరుపతిరావు ఆయనను డీసీసీ కార్యవర్గ సభ్యుడు గా నియమించారు. 1972 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. తడపట్ల రత్నాబాయి ఎన్నికల ఎజెంట్ గా దేశాయ్ గిరిజన ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో పరిచయాలు సంపాదించారు. ఆతరువాత ఏజెన్సీ ప్లీడరు(సనద్ హోల్డర్) గా కలెక్టర్ ద్వారా నియమితులయ్యారు. సనద్ హోల్డర్ అంటే లా చదవకపోయినా ఏజెన్సీ ప్రాంతాల్లో మున్సిఫ్ కోర్టులో గిరిజనుల పక్షాన వాదించవచ్చు. 1980-81లో మారేడుమిల్లి పంచాయతీ సమితి అధ్యక్షుడు గా కుర్ల రాజా రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన దేశాయ్ అప్పటి జెడ్పీ చైర్మన్ పంతం పద్మనాభం చొరవతో జడ్ పి కో ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యారు.తరువాత తూర్పు, పశ్చిమగోదావరి ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న రాజమండ్రి కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా పోటీ చేసిన ఏజెన్సీ కింగ్, సన్నిహిత మిత్రులు ముత్యాల రాయుడు గెలుపులో దేశాయ్ కీలకపాత్ర పోషించారు. 1985లో దివంగత ఎన్టీఆర్ ప్రభంజనం సమయంలో అంతా వెనుకంజ వేసిన సమయంలో సాహసోపేతంగా బూరుగుపూడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం విశేషం.
న్యాయరంగంలో నిపుణతకు, వాదనా పటిమకు ఏజెన్సీ ప్లీడర్ హోదా ఎంతో దోహదం చేసింది. న్యాయనిపుణుడిగా, రాజకీయ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా సేవలందించిన దేశాయ్ ఆయా రంగాల్లో తనదైన ముద్రవేశారు. ఏజెన్సీలో సామాజిక, సాంస్కృతిక, విద్యాభివృద్ధికి కూడా దేశాయ్ విశేషంగా కృషిచేశారు. భాగంగా సాంసృతిక అభివృద్ధి సంస్థను స్థాపించి, దానికి కార్యదర్శిగా ప్రజా విరాళాలతో రంపచోడవరం, కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, దేవీపట్నం, ఇందుకూరుపేట లో జడ్ పి హై స్కూల్లు ఏర్పాటు చేశారు.