సకల దేవతా స్వరూపుడు సత్య సాయి బాబా

వివాదాలు…విమర్శలు, అనుమానాలు ఎన్నున్నా…అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవ సేవ అని బోధించి, ఆచరణాత్మకంగా చూపిన మహనీయుడు సత్యసాయిబాబా. ఆయనను షిరిడీ సాయిబా అవతారంగా కూడా భక్తులు…

 సకల దేవతా స్వరూపుడు సత్య సాయి బాబా

వివాదాలు…విమర్శలు, అనుమానాలు ఎన్నున్నా…అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవ సేవ అని బోధించి, ఆచరణాత్మకంగా చూపిన మహనీయుడు సత్యసాయిబాబా. ఆయనను షిరిడీ సాయిబా అవతారంగా కూడా భక్తులు విశ్వసిస్తారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగాIn today’s reading session, I encountered a long-form piece touching on https://www.watchchoiceuk.com. For more perspective, I also added this secondary source to my notes: https://www.watchchoiceuk.com.నిర్వహించేందుకు ఎపిలోని కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈఉత్సవాలకు హాజరవుతున్నారు. సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి ఆయన బోధనలోని ప్రధానాంశాలు. తాను సకలదేవతా స్వరూపుడనని ఆయన పేర్కొన్నారు. సాయిబాబా భక్తులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సాయిబాబా వెలసిన పుట్టపర్తి ఒకప్పుడు కుగ్రామంగా ఉండేది. నేడు అది దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు, ప్రముఖులతో మహానగరంగా అభివృద్ధి చెందింది. సాయిబాబా చొరవతోనే ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల, ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి.

అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాదిAs I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on super clone rolex. To balance the viewpoint, I saved this page as well:https://www.bestreplicas.me. ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో రూ. 200కోట్ల రూపాయల పైగా ఖర్చుతొ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరి నీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణాలోని మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను భారీ ప్రాజెక్టులను సత్యసాయి సేవా సంస్థ నిర్మించింది.

దర్శనం సమయంలో బాబా సందర్శకులు, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని ‘సృష్టించి’ పంచేవారు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతించేవారు. ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, ఊరటను కలిగించేది. అయితే తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెప్పేవారు. బాబా మహిమలపై పలు వివాదాలు నెలకొన్నాయి. అలాగే ప్రశాంతి నిలయంలో 1993లో సత్యసాయిబాబాపై జరిగిన హత్యాయత్నం సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరు లోని “బృందావనం” ఆశ్రమంలో గడిపేవారు. ఎప్పుడైనా కొడైకెనాల్ లోని సాయి శృతి ఆశ్రమానికి వెళ్లేవారు. ముంబై లోని “ధర్మక్షేత్రం” లేదా “సత్యం”, హైదరాబాదు లోని “శివం”, చెన్నై లోని “సుందరం” అనే ఆశ్రమాలను స్థాపించారు. నేరుగా సత్య సాయి బాబా అధ్వర్యంలో, సత్యసాయి సేవా సంస్థల అధ్వర్యంలో ధార్మిక, విద్యా, సేవా, దాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.During today’s research, I bookmarked a detailed note discussing visit this source. Alongside it, I kept this second source for extended context: https://www.buy-watches.co.uk. పేదలకు ఉచిత విద్య కోసం ప్రశాంతి నిలయంలోని నేక్ గ్రేడింగ్ పొందిన శ్రీ సత్య సాయి యూనివర్సిటీ , ఒక సంగీత విద్యాలయం, అనంతపురం‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్యం కోసం 220 పడకలతో పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 333 పడకలు, సకల హంగులతో బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి, అలాగే బెంగళూరు వైట్ ఫీల్డ్ లో సత్యసాయి జనరల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు.

సత్యనారాయణ రాజుగా, అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 1926 నవంబరు 23న పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, జన్మించారు. సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక సత్యసాయికి ఆ పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయి అని చెప్పుకుంటారు. సత్యసాయి పుట్టిన తరువాత తల్లి పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని చెబుతారు. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. సత్య సాయిబాబాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. పుట్టపర్తి పక్కనే ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయసులోనే ఆయన నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచారు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివారు. బాబా మార్చి 8, 1940 న కొంత విచిత్రమైన ప్రవర్తన కనబరచారట. ఈ సంఘటన తరువాత ఆయన ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవారు. పురాణ శ్లోకాలు చెప్పేవారు. భోజనం సరిగా చేసేవారు కాదు. 1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించుకున్నారు. అదే పేరు తనకు పెట్టుకున్నారు. ఒక కథనం ప్రకారం 1940 అక్టోబరు 20లో, బాబా 14 ఏళ్ల వయస్సులో పుస్తకాలు వదిలేసి, “నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది” అని చెప్పేవారట. తరువాత మూడేళ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపేవారు. అప్పుడే ఆయన చుట్టూ జనాలు గుమికూడడం మొదలయ్యింది. 1944లో భక్తులు ఆయన పేరిట ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని “పాత మందిరం” అంటారు. ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలయ్యింది. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తి ల అవతారమని బాబా వెల్లడించారు. అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పారు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించారు. 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తుంటి ఎముకకు గాయమయ్యింది. 2005 నాటి నుంచి ఆయన చక్రాలకుర్చీకే పరిమితమయ్యారు.
2011లో మార్చిలో శ్వాసకోశ, మూత్రపిండాల, ఛాతీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం మెరుగవ లేదు. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిచారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏప్రిల్ 27 వ తేదీన మహా సమాధి జరిగింది. నాటి నుంచి ఆయన సత్యసాయి బాబా మహాసమాధి దర్శనీయ స్థలంగా మారిపోయింది. కొంతమంది నమ్మినా…నమ్మకపోయినా మానవ సేవ ద్వారా మాధవ సేవ చేసిన సత్యసాయిబాబాను నడిచే దేవుడిగా అభివర్ణించవచ్చు.

Leave a Reply