- October 2, 2024
అరసవిల్లిలో భక్తులకు కనువిందు
శ్రీకాకుళం జిల్లా: అరసవిల్లి (Arasavalli)లో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. శ్రీ సూర్యనారాయణ స్వామి (Sri Suryanarayana Swamy) క్షేత్రంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని…
శ్రీకాకుళం జిల్లా: అరసవిల్లి (Arasavalli)లో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. శ్రీ సూర్యనారాయణ స్వామి (Sri Suryanarayana Swamy) క్షేత్రంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని రెండవ రోజు బుధవారం ఉదయం స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు (Sun Rays) నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది. రెండు నిమిషాలు పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి. ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీలు, ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో మూల విరాట్‌ను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి.