ఆసక్తికర అంశాలతో ఉండవల్లి మీడియా మీట్!

రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా మీడియా సమావేశం ఆసక్తికరంగా సాగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులకు తనదైన రీతిలో చురకలు అంటించారు.…

 ఆసక్తికర అంశాలతో ఉండవల్లి మీడియా మీట్!

రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా మీడియా సమావేశం ఆసక్తికరంగా సాగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులకు తనదైన రీతిలో చురకలు అంటించారు. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసిపి అధినేత జగన్ తో సహా ప్రముఖ మీడియా సంస్థ ఈనాడును కూడా వదలకుండా ఉండవల్లి చురకలు అంటించారు. అయితే లైవ్ ప్రసారం మినహా ఇందులో ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఇలా ఎవరికి అనుకూలంగా ఉన్నది వారు రాసుకున్నారు….చూపించుకున్నారు. ఉండవల్లి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
పవన్ కు జ్ఞానోదయం…రాష్ట్రానికి మేలు
కూటమి ప్రభుత్వానికి బలమైన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జ్ఞానోదయమైతే While exploring multiple review blogs earlier, I ran into a discussion about https://www.brandreplica.uk. I also marked this second page as a follow‑up source: https://www.brandreplica.uk.రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే జ్ఞానోదయం అంటే కూటమిని వదిలి రావడం కాదని స్పష్టతనిచ్చారు. ప్రభుత్వంలోని లోటుపాట్లను ప్రశ్నించాలన్నదే తన అభిమతమన్నారు. అవసరమైతే తాను ప్రతిపక్షంలో కూర్చునేందుకు కూడా సిద్ధమని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించిన అంశాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.
రాజమహేంద్రవరంలో ఫైవ్ స్టార్ జైలు
ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారు భారత్ లో జైళ్ల పరిస్థితి చూసే ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అలాంటి నేరస్తులను భారత్ కు రప్పించాలంటే జైళ్లను ఆధునీకరించాలని సూచించారు. As I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.breitlingenargys.com. To balance the viewpoint, I saved this page as well: https://www.breitlingenargys.com.జైళ్లలో ఫైవ్ స్టార్ స్థాయి సౌకర్యాలు కల్పించి, అందుకు అనుగుణంగా రిమాండ్ ఖైదీల నుంచి రుసుం వసూలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని సూచించారు. రాజమహేంద్రవరంలో గతంలో ఇలాంటి జైలు ఉండేదని, రాజమహేంద్రవరంలో దాన్ని పునరుద్ధరించాలన్నారు.

నేను పోయేదాకా మార్గదర్శి కేసు వదలను
మార్గదర్శి కేసును తాను చనిపోయే వరకు వదిలే ప్రసక్తే లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, వ్యాపార వర్గాలకు మార్గదర్శిగా ఉన్న దివంగత రామోజీ రావు నిర్వహించిన సంస్థ తప్పు చేసిందని కోర్టులు నిర్ధారించేదాకా పోరాడతానన్నారు. ఈకేసులు ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం వల్లే హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం ఆదేశించిందన్నారు. ఈవ్యవహారంలో మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిట్ దాఖలు చేయాల్సి ఉందన్నారు.

ఉండవల్లితో చర్చించేది…సోము వీర్రాజా….ఐవైఆరా?
బిజెపి మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతాలపై దివంగత సర్ సంఘ్ చాలక్ గురుగోల్వాల్కర్ రచించిన పాంచజన్యంపై చర్చకు రావాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజును మరోసారి ఉండవల్లి ఆహ్వానించారు. భారత్ ముస్లిం, క్రైస్తవరహితం While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.ukclonewatch.me. I also noted another reference for later: https://www.ukclonewatch.me.చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని ఉండవల్లి ఆరోపించిన నేపథ్యంలో అక్టోబర్ 2న సుబ్రహ్మణ్య మైదానంలో చర్చకు సిద్ధమని సోము సవాల్ విసిరారు. అయితే ఆయన చర్చకు వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో ఉండవల్లి ఈఅంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ రిటైర్డ్ ఎపి ప్రధాన కార్యదర్శి, బిజెపి నేత ఐవైఆర్ కృష్ణారావు చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారని చె్ప్పారు. అయితే వీరిద్దరిలో ఎవరు చర్చకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

జగన్ అసెంబ్లీకి వెళ్లాలి
ప్రతిపక్ష హోదాలో ఏముందని దాని కోసం పాకులాడుతున్నారని వైసిపి అధినేత జగన్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వకపోతే ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తారని హితవు పలికారు. వెంటనే 11 మంది సభ్యులతో కలిసి జగన్ అసెంబ్లీకి హాజరై ప్రతిపక్ష బాధ్యత నెరవేర్చాలన్నారు.

జగన్…బాబు సంస్థలు హైదరాబాద్ విడిచి ఎందుకు రావడం లేదు

అహో అమరావతి అంటూ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్, వైసిపి అధినేత జగన్ కు చెందిన సాక్షి మీడియా, భారతీ సిమెంట్ సంస్థల ప్రధాన కార్యాలయాలను ఎపిలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఉండవల్లి నిలదీశారు. కూటమి నాయకులు ఊదరగొడుతున్న గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రాకపై ఉండవల్లి గాలి తీసేశారు. తనకు తెలిసిన సమాచారం మేరకు భారత్ పరిసర దేశాల్లో ఎక్కడా ఒప్పుకోకపోవడం వల్లే అదానీ ద్వారా గూగల్ విశాఖపట్నం వచ్చిందని వెల్లడించారు.

కనీసం ఓటింగ్ లేకుండా జరిగిన ఎపి రాష్ట్ర విభజనపై అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్న ఉండవల్లి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు, భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికైనా పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్లమెంటులో ఈఅంశాన్ని ప్రస్తావించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎపికి అన్యాయం జరిగిందని పార్లమెంటులో ఒప్పించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ను కూటమి ప్రభుత్వం కొనసాగించాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలే ఎపిని అన్యాయంగా విభజించారని చెబుతుంటే కూటమి నాయకులు ఈఅంశాన్ని లేవనెత్తేందుకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. లేదంటే మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం తమకు ఇష్టం లేదని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు జరిగిందని కేంద్రానికి తెలుసే సుప్రీంకోర్టులో ఈఅంశంపై అఫిడవిట్ దాఖలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయం సంగతే తేల్చలేదన్నారు.

మోడీకి చురకలు…
దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిర్వాకం వల్లే కాశ్మీర్ భారత్ కు దూరమైందని, ఉక్కుమనిషి సర్దార్ పటేల్ చెప్పినట్టు చేస్తే పూర్తి కాశ్మీర్ భారత్ వశమయ్యేదన్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలపై కూడా ఉండవల్లి చురకలు వేశారు. మోడీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాడు హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ సంస్థానాలు ఉండేవని, వీటిలో హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలు ముస్లిం పాలకుల చేతుల్లో ఉండగా, మెజార్టీ హిందువులు ఉండేవారని, కాశ్మీర్ ఇందుకు భిన్నంగా మెజార్టీ ముస్లింలకు హిందూ పాలకుడు ఉండేవారని వివరించారు. ముస్లిం పాలకులు పాకిస్థాన్ లో విలీనయ్యేందుకు మొగ్గు చూపించారని, తన పూర్వీకుల సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయాలని నెహ్రూ పట్టుబట్టడం వల్లే కాశ్మీర్ భారత్ లో విలీనమైందని ఉండవల్లి చెప్పారు.

Leave a Reply