• November 4, 2024

రాజమహేంద్రవరంలో తొలి రోబోటిక్ మో చిప్ప మార్పిడి

    రాజమహేంద్రవరంలోని సాయి ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ ద్వారా అరుదైన మోచిప్ప మార్పిడి జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా మోచిప్ప ఆపరేషన్ చేసిన ఘనత…

 రాజమహేంద్రవరంలో తొలి రోబోటిక్ మో చిప్ప మార్పిడి

 

 

రాజమహేంద్రవరంలోని సాయి ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ ద్వారా అరుదైన మోచిప్ప మార్పిడి జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా మోచిప్ప ఆపరేషన్ చేసిన ఘనత సాయి హాస్పిటల్ దక్కించుకుంది. దక్షిణ భారతంలో మంగుళూరు, హైదరాబాద్ తరువాత రాజమహేంద్రవరంలో జరిగినది మూడో సర్జరీ అని ఆసుపత్రి అధినేత, సర్జరీ నిర్వహించిన డాక్టర్ కురుకూరి విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. బాధితురాలికి స్వీడన్ సంస్థ తయారుచేసిన మోచిప్పను అమర్చడం విశేషం. అమెరికాలో స్ధిరపడ్డ ప్రవాస భారతీయురాలు తన మోకాలు నొప్పికి సరయిన పరిష్కారం కోసం, అటు అమెరికాలోను, ఇటు భారతదేశంలోనూ చాలా మంది వైద్య నిపుణులను సంప్రదించారు. అలాగే సాయి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.  మోకాలి నొప్పికి మూల కారణాన్ని గుర్తించిన విజయ్ కుమార్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఇందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేయడంతో స్వీడన్ కు  చెందిన ‘ఎపిసీల్ ‘ అనే సంస్థ మోచిప్పను బాధితురాలి కాలికి తగ్గట్టుగా డిజైన్ చేయించి, మంగుళూరుకు చెందిన డాక్టర్ దీపక్ రే, యశోద హాస్పిటల్కు చెందిన డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి సహకారంతో మోచిప్ప మార్పిడి సర్జరీ విజయవంతంగా పూర్తిచేసి, జాతీయ వైద్య రంగ చిత్రపటంలో రాజమహేంద్రవరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చామని ఈసందర్భంగా విజయ్ కుమార్ ఆనందం వ్యక్తంచేశారు. సహజంగా ఇలాంటి మోచిప్ప సమస్య, మహిళల్లో ఎక్కువగా చూస్తుంటామని డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. బరువు, మోకాళ్లపై అధిక వత్తిడి వంటి కారణాల వలన ఈ సమస్య వస్తుందని వివరించారు. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ మొత్తం మోకీలు తీయకుండా తిరిగిన మోచిప్ప భాగాన్ని తొలగించి ఆపరేషన్ చేయడం ఆంధ్రప్రదేశ్ లో ఇదే తొలి సర్జరీ కావడం, అందులో తాము భాగస్వాములవ్వడం ఆనందంగా ఉందన్నారు. అత్యాధునికమైన ఈచికిత్సకు ఎంత ఖర్చవుతుందన్నది వెల్లడించకపోవడం కొసమెరుపు.

Leave a Reply