- May 25, 2026
పుష్కరాల సమీక్షకు వచ్చి..గోదావరిని చూసి దిమ్మదిరిగి.. మైండ్ బ్లాంక్ అయిన పవన్..
జనసేనాని…ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి పుష్కరాల పనుల సమీక్షలో భాగంగా రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు నుంచి కోటిలింగాల రేవు వరకు ప్రత్యేక బోటులో గోదావరిలో పర్యటించారు. రాజమహేంద్రవరం…
జనసేనాని…ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి పుష్కరాల పనుల సమీక్షలో భాగంగా రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు నుంచి కోటిలింగాల రేవు వరకు ప్రత్యేక బోటులో గోదావరిలో పర్యటించారు. రాజమహేంద్రవరం నగరం నుంచి మురుగునీటిని తరలించే గోదావరి చెంతనే ఉన్న నల్లా చానల్ ను పరిశీలించారు. ఈసందర్భంగా గోదావరితీర ప్రాంతంలోని కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, నల్లా చానల్ వద్ద దుస్థితిని చూసి పవన్ కల్యాణ్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. గోదావరిని మరీ ఇంత దగ్గరగా చూసి ఉండరు. అందుకే ఆయన ఒకింత షాక్ కు గురయ్యారు. గోదావరితీరంలో ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై పవన్ కు ఫిర్యాదు చేయడంతో ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. గోదావరినీటి నాణ్యతపై కూడా ఆయన ఆరా తీసి, పరిశీలన చేయించారు. అనంతరం ఆయన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా గోదావరిలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యర్థ జలాలలను వదిలి జీవ నదులను కాలుష్యంతో మనమే చంపేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నదిని తల్లితో సమానంగా భావించి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ‘గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గోదావరిలోకి రోజువారీ సుమారుగా 55 ఎం. ఎల్. డి. (మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగునీరు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మురుగు నీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలి. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాలని పవన్ సూచించారు. కాలుష్యరహిత గోదావరి పుష్కరాలే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గోదావరి ప్రక్షాళనకు మన నది – మన నుడి” కార్యక్రమాన్ని ముందుకు వెళతామన్నారు గోదావరితీరాన ఉండే పరిశ్రమలు తమ సిఎస్ఆర్ నిధులతో నదీ సంరక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థజలాల నిర్వహణపై కూడా పవన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో పునర్వినియోగ వస్తువుల వినియోగానికే అనుమతివ్వాలని స్పష్టం చేశారు. “. గోదావరి ప్రక్షాళనకు 14 రోజుల్లో సమగ్ర కార్యాచరణ నివేదిక సమర్పించాలని పవన్ ఆదేశించారు. గోదావరి పుష్కరాల పనులపై పవన్ కల్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏడాది గడువులోగా వేలాది ప్రతిపాదత దశలోనే ఉన్న పనులు ఏలా పూర్తి చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాల పాటు గోదావరి నదిలో కాలుష్యాన్ని నివారించలేకపోయిన పాలకులు పుష్కరాల్లోగా గోదావరిని ప్రక్షాళన చేసి, పవిత్రంగా మార్చేస్తారా అన్నది చర్చనీయాంశమే.
”