• October 7, 2024

క్రమశిక్షణ గల దొంగ

      దొంగల్లో కూడా క్రమశిక్షణ ఉంటుందని నిరూపించాడు కృష్ణా జిల్లాకు చెందిన చుండూరు రమే ష్ బాబు అనే అంతర్ జిల్లా మోటారు సైకిళ్ల…

 క్రమశిక్షణ గల దొంగ

 

 

 

దొంగల్లో కూడా క్రమశిక్షణ ఉంటుందని నిరూపించాడు కృష్ణా జిల్లాకు చెందిన చుండూరు రమే ష్ బాబు అనే అంతర్ జిల్లా మోటారు సైకిళ్ల దొంగ. ఒక ప్రాంతంలో చోరీ చేసిన తరువాత మళ్లీ అదే ప్రాంతంలో చోరీ చేయడు.  స్థానికులు, పోలీసులకు దొరక్కుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా పోలీసులకు దొరికిపోవడం విశేషం. తాను చోరీ చేసిన ప్రాంతాలు, మోటారు సైకిళ్ల వివరాలను రమేష్ బాబు తన చిన్న డైరీలో రాసుకోవడంతో పోలీసుల పని మరింత సులువైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరంలో వన్ టౌన్ పోలీసులు రంభ-ఊర్వశి థియేటర్ ఉల్లి మార్కెట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా చుండూరు రమే ష్ బాబు  వద్ద ద్విచక్ర వాహన పత్రాలు లేకపోవడంతో స్టేషన్ కు తరలించారు. అతన్ని విచారించగా చోరీల్లో క్రమశిక్షణ…డైరీ విశేషాలు బహిర్గతమయ్యాయి. గత ఎనిమిది నెలల్లో రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల, నల్లజర్ల, వీర వల్లి, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో మొత్తం రూ. 9.98 లక్షల విలువైన  22 వాహ నాలు చోరీచేసి పలువురికి విక్ర యించినట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply