ఈసారి టార్గెట్ రోజా…వైసిపి అక్రమాలపై మరో కమిటీ!

తిరుమల లడ్డూ…గనుల అక్రమాలపై సిట్, సిఐడిలతో దర్యాప్తు చేపట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా పర్యాటకశాఖ అక్రమాలపై కూడా మరో కమిటీ వేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్,…

 ఈసారి టార్గెట్ రోజా…వైసిపి అక్రమాలపై మరో కమిటీ!

తిరుమల లడ్డూ…గనుల అక్రమాలపై సిట్, సిఐడిలతో దర్యాప్తు చేపట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా పర్యాటకశాఖ అక్రమాలపై కూడా మరో కమిటీ వేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పక్కలో బల్లెంలా మారిన చిత్తూరు జిల్లాలోని వైసిపి కీలకనేత, మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని వీటిని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వ లక్ష్యం పర్యాటకశాఖ మంత్రి రోజా కావచ్చన్న చర్చ జరుగుతోంది. విశాఖపట్నంలో పర్యటించిన పర్యాటకశాఖ, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటకశాఖ అక్రమాలపై కమిటీని వేయననున్నట్లు ప్రకటించారు.

పర్యాటక అభివృద్ధి పనులు కుంటు పడటంలో గత ప్రభుత్వ అక్రమాల అవశేషాలు కనబడుతున్నాయని దుర్గేష్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అక్రమాల వల్ల హరిత రిసార్ట్స్, పున్నమి యాత్రి నివాస్ లో ఇప్పటికే పూర్తవ్వాల్సిన పనులు సకాలంలో జరగకపోవడం వల్ల పర్యాటక సీజన్ ను కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. తద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోయే అవకాశం ఉందన్నారు.  పర్యాటక అభివృద్ధి సంస్థలో  రూ. 8.60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ ఆధునికీకరణ పనుల్లో 90 శాతం నిధులు ఖర్చు చేసినప్పటికీ అదనంగా మరో రూ. 4 కోట్లు అవసరమవుతాయని మంత్రి వెల్లడించారు. ఆగస్టు 31 నాటికి పూర్తవ్వాల్సిన పనులు గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ముందుకు సాగలేదన్నారు. ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్ ని వివరాలు అడగ్గా గత ప్రభుత్వం నోటిమాటగా కొత్తగా మార్పులు సూచించిందని చెప్పారన్నారు. తద్వారా సమయంతో పాటు ఖర్చు పెరుగుతుందని వెల్లడించారు.. ఈ అంశంపై కమిటీ వేసి, సుదీర్ఘంగా విచారణ చేపడతామన్నారు. సంబంధిత కమిటీతో విజయవాడలో సమీక్ష నిర్వహించి చర్చిస్తామన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతి, జరగాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి  చర్చించి, త్వరితగతిన  పనులు పూర్తి చేసేలా ముందుకు వెళ్తామన్నారు..

విశాఖకు మహర్దశ…

విశాఖపట్నంలో తెన్నేటి పార్కు,  పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ పున్నమి, యాత్రి నివాస్,హరిత రిసార్ట్స్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటక సీజన్ ప్రారంభం నాటికి హోటళ్లను అందుబాటులోకి తెచ్చి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ తో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. బీచ్ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే అటవీ శాఖ, సోషల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులు తప్పనిసరి అన్నారు. ఈ అంశంపై త్వరలోనే  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి అటవీ శాఖ అనుమతులు తీసుకుంటామన్నారు. ఆయా శాఖల అనుమతులు రాగానే అభివృద్ధి పనులు చేపట్టి వీలైనంత త్వరగా బార్ అండ్ రెస్టారెంట్ కిచెన్ తదితర సౌకర్యాలను కల్పించి పర్యాటకులకు  అందుబాటులోకి తెస్తామన్నారు. ఎపిలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి  అవసరమైన అన్ని వనరులున్నాయని, పెట్టుబడిదారులను ఆహ్వానించి,  పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో టూరిజం కి పెద్దపీట వేసి, అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచుతామన్నారు. భోగాపురం సమీపంలోని అన్నవరం ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్స్ పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ ముందుకు వచ్చిందని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి, పూర్తి చేసి త్వరితగతిన పర్యాటకులకు వినియోగంలోకి తెస్తామన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ ద్వారా  టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, స్వదేశీ దర్శన్ ద్వారా ఐకానిక్ టూరిస్ట్ ప్రాజెక్ట్లు చేపడతామని, అదేవిధంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

 

 

Leave a Reply