- October 14, 2024
యాంకర్ పై వైసిపి నాయకుడు దాడి
యాంకర్ పై మాజీ ఎంపి భరత్ రామ్ సన్నిహితుడు ఎన్ వి శ్రీనివాస్ ఆదివారం దాడి చేయడం సంచలనం సృష్టించింది. 3ఏళ్ల క్రితం తీసుకున్న సుమారు 3లక్షల…
యాంకర్ పై మాజీ ఎంపి భరత్ రామ్ సన్నిహితుడు ఎన్ వి శ్రీనివాస్ ఆదివారం దాడి చేయడం సంచలనం సృష్టించింది. 3ఏళ్ల క్రితం తీసుకున్న సుమారు 3లక్షల రూపాయల సొమ్మును తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి అడగటంతో ఆగ్రహంతో తన తండ్రితో పాటు, తనపైనా దాడి చేసినట్లు బాధితురాలు యాంకర్ కావ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని మాజీ ఎంపి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు బాధితురాలు కావ్యశ్రీ ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బాధితురాలు తెలుగు మహిళలతో కలిసి విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేసిన ఎన్ వి శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.