• January 2, 2025

2024 కొంచెం కష్టం…కొంచె ఇష్టం…

ఉగాది పచ్చడిలా 2024 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాతో  పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీపి, చేదు, పులుపు వంటి షడ్రుచుల కలయికతో ముగిసింది. 2024లో కొంతమందికి మంచి…

 2024 కొంచెం కష్టం…కొంచె ఇష్టం…

ఉగాది పచ్చడిలా 2024 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాతో  పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీపి, చేదు, పులుపు వంటి షడ్రుచుల కలయికతో ముగిసింది. 2024లో కొంతమందికి మంచి జరిగితే మరి కొంతమందికి వివిధ రకాలుగా నష్టం..కష్టం కలిగాయి. రానున్నవి అన్నీ మంచిరోజులే అన్న కొత్త ఆశలతో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం…గత ఏడాది జరిగిన ముఖ్య ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం….

జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను ఇంఫాల్, మణిపూర్ నుంచి ప్రారంభించారు. దీర్ఘకాలంగా హిందువుల తీరని కోరికగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం పునఃప్రారంభమైంది.

మార్చిలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆతరువాత కొద్దిరోజులకు ఇదే కేసులో తెలంగాణా మాజీ సిఎం కెసిఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసి దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉంచారు. ఏప్రిలో

జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకుగాను 48 స్థానాలను గెలుచుకుని రికార్డు స్థాయిలో మూడోసారి హర్యానాలో బిజెపి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. అదే నెలలో జరిగిన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా 60 స్థానాలకుగాను 46 స్థానాలతో బీజేపీ విజయం సాధించింది.

ఏప్రిల్ 19నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ వరుసగా 3వసారి ప్రధానిగా జూన్ లో ఎన్నికయ్యారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికి బీజేపీ 78 స్థానాలను గెలుచుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. జూన్ 27 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్‌సభను ప్రారంభించారు. జూన్ లో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

 

  • జులై 1న ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితతో మరో రెండు చట్టాలు అమలులోకి వచ్చాయి. జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక మతపరమైన కార్యక్రమంలో  జరిగిన తొక్కిసలాటలో సుమారు 123 మంది మరణించారు. జూలైలో పారిస్ లో జరిగిన ఒలిపింక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అలాగే  మిక్సిడ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు.జూలై చివరిరోజున కేరళలో వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 231 మంది మృతి చెందగా, 118 మంది గల్లంతయ్యారు.

ఆగస్టులో  పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ పోటీలో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 50 కేజీల విభాగంలో  వినేష్ ఫోగట్ అనర్హురాలయ్యారు. కనీసం కాంస్యం గెలుస్తారని భావించిన ఆమె 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండటంతో పోటీ నుంచి తప్పుకోవాల్సిరావడం భారతీయులను నిరాశ పరిచింది. పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకాన్ని, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం గెలుచుకున్నారు.పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

ఆగస్టులో  కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని, నిరసనలను రేకెత్తించింది.

మణిపూర్‌లో కుకీ, మైతేయ్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు చెలరేగి ఐదుగురు మృతి చెందారు. సెప్టెంబర్  12న  ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, తెలుగువారైన  సీతారాం ఏచూరి కన్నుమూశారు. మద్యం కుంభకోణం నేపథ్యంలో ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా, అతిషి బాధ్యతలు స్వీకరించారు.సెప్టెంబరు 18న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని, రాజకీయ దుమారాన్ని సృష్టించింది.

అక్టోబర్ లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ 90 సీట్లకు గాను 48 అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అక్టోబర్ 9న  ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ నావల్ టాటా కన్నుమూశారు.

2024 అక్టోబర్ లో కేరళలోని వయనాడ్ ఎంపి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ విజయం సాధించి, తన సోదరుడి స్థానాన్ని ఆక్రమించారు.

 

నవంబర్ లో జరిగిన  అమెరికా ఎన్నికల్లో  47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికయ్యారు.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో . 288 స్థానాలకు 235 స్థానాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

డిసెంబర్ 12న తెలుగువాడైన 18 ఏళ్ల గుకేశ్ దొమ్మరాజు అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచి, చరిత్ర సృష్టించాడు. డిసెంబర్ 15న  తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఈనెలలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.డిసెంబర్ 26న దేశానికి ఆర్థిక దిక్సూచిగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలధర్మం చెందారు.

 ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఒక ప్రభంజనమే సృష్టించింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 175 స్థానాల్లో 164 సీట్లను గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జిల్లావ్యాప్తంగా కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్టయ్యింది. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి తొలిసారిగా నెగ్గి, డిప్యుటీ సిఎంగా పదవిని చేపట్టారు. రాజమహేంద్రవరం ఎంపిగా బిజెపి రాష్ట్ర అద్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యేగా టిడిపి తరుపున ఆదిరెడ్డి వాసు, రూరల్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు.

డిసెంబర్ లో పుష్ప-2 సినిమా విడుదలై…వివాదాలకు కేంద్రంగా మారింది. సంధ్య ధియేటర్ కు హీరో అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఈకేసులో అల్లు అర్జున్ అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దురామారాన్ని లేపింది.

ఈ ఏడాది ఏపీలో జరిగిన అత్యంత ఘోర విషాదం. ఆగస్టులో సంభవించిన విజయవాడలోని బుడమేరు వరదలు. రెండు వారాల పాటు వరదలు ప్రజలను బెంబేలెత్తించింది.  

మేనెలలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ కృష్ణబాబు కన్నుమూశారు.

జిల్లా ప్రజల ఇలవేలుపు అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ప్రసాదానికి ఈఏడాది సెప్టెంబర్ లో జాతీయస్థాయిలో మరో సారి గుర్తింపు లభించింది. సుచి,శుభ్రతలో భారత ఆహార ప్రమాణాల సంస్థ గుర్తింపు ఇవ్వడం భక్తులను ఆనందపరిచింది.

ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలు, గోదావరి, ఏలేరు వరదలైతే వారాల తరబడి ప్రజలను బెంబేలెత్తించాయి.ఒక్క ఏలేరు వరద ధాటికే రూ.172 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మరణం ఎందరినో కలచివేసి విషాదంలోకి నెట్టింది.

సెప్టెంబరులో రాజమహేంద్రవరం దివాన్‌చెరువు సమీపంలో పులి అడుగు జాడలు రాజమ హేంద్ర వరం వాసులను బెంబేలెత్తించాయి. కొన్ని వారాల పాటు పులి సంచారం ప్రజలను పరు గులు తీయించింది.

నవంబర్ లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కాకినాడ పేరు మార్మోగేలా చేసింది. అదే స్టెల్లా నౌక.బియ్యం లోడింగ్‌ కోసం వచ్చిన నౌకలో రేషన్‌ బియ్యం పట్టుబడడంతో డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్  కాకినాడకు వచ్చి సీజ్‌ ద షిప్‌ అన్నారు.ఈ డైలాగ్‌ విపరీతంగా వైరలైంది.

డిసెంబర్ నుంచి ఉభయ గోదావరి జిల్లా వాసుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి మెట్రోపాలిటన్ నగరాలు డిల్లీ, ముంబయ్ లకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.  

డిసెంబరులో ప్రత్తిపాడులో మరోసారి  పులి సంచారం ప్రచారం జిల్లాను వణికించింది.

 

 

Leave a Reply