…ఇప్పుడు మహాకుంభమేళాలో ఘోరం…2027 పుష్కరాలకు పాఠం కానుందా?!

  ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కేంద్రంగా జరుగుతున్న  మహాకుంభమేళా మహా ఘోరం జరిగిపోయింది. మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానాలు ఆచరించేందుకు దాదాపు 3కోట్ల మంది భక్తులు…

 …ఇప్పుడు మహాకుంభమేళాలో ఘోరం…2027 పుష్కరాలకు పాఠం కానుందా?!

 

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కేంద్రంగా జరుగుతున్న  మహాకుంభమేళా మహా ఘోరం జరిగిపోయింది. మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానాలు ఆచరించేందుకు దాదాపు 3కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈసందర్భంగా సెక్టర్-2లో భక్తుల రద్దీ కారణంగా బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈదుర్ఘటనలో 20 మందికి పైగా మరణించగా… 100 మందికి పైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. భక్తులంతా గంగా, యుమున, సరస్వతి నదుల  త్రివేణీ సంఘమ  ప్రదేశం వద్ద ఒకే స్నానఘట్టంలో స్నానాలు చేసేందుకు ప్రయత్నించడమే ఈదుర్ఘటనకు కారణంగా భావిస్తున్నారు. మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించడంతో ఇప్పటికే దాదాపు 10కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించారని అంచనా.

2015 గోదావరి పుష్కరాలలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. అప్పుడు కూడా బిజెపి మిత్రపక్షంగా ఉండేది. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా పుష్కరాలంటూ 2015 గోదావరి పుష్కరాలకు ఎక్కడలేని ప్రచారం కల్పించారు. నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతో సహా వచ్చి పుష్కరాలరేవు వద్ద తొలి స్నానం చేశారు. ఈసందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులను బారీకేడ్లలో నిలిపివేసి,  పుష్కరాల ఈవెంట్ కు అంతర్జాతీయ, జాతీయస్థాయి ప్రాధాన్యతను కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో డ్రోన్లతో షూటింగ్ జరిపించారు. బాబు వెళ్లిపోయిన వెంటనే ఘాట్ లోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది వరకు భక్తులు, యాత్రికులు దుర్మరణం చెందారు.

గత పుష్కరాలు, నేటి మహా కుంభమేళా అనుభవాలు 2027 గోదావరి పుష్కరాలకు పాఠాలు కానున్నాయా. అంటే అవుననే చెప్పవచ్చు. తిరుపతిలో ఇటీవల జరిగిన వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీని కూడా ఒక పాఠంగా తీసుకోవచ్చు. వీటి ద్వారా భక్తుల రద్దీని సమన్వయంతో నియంత్రించాల్సిన అవసరాన్ని ఈసంఘటనలు నొక్కి చెబుతున్నాయి. భక్తులు ఒకేచోట పెద్దసంఖ్యలో చేరుకోకుండా వికేంద్రీకరణ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

ఈనేపథ్యంలో గతంలో మాదిరిగా కుండా

గోదావరిలో ఎక్కడ స్నానం చేసిన పుష్కరాల పుణ్య ఫలమే…

గత అనుభవాల దృష్ట్యా ఇదే కూటమి ప్రభుత్వ కొత్త నినాదం కావచ్చు.

 

2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  పుష్కరాలకు సుమారు 8కోట్ల మంది భక్తులు, యాత్రికులు తరలివస్తారన్న అంచనాతో సుమారు రూ. 904కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరితీరంలో  ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రో నాలుగు కొత్త ఘాట్లు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు.

 

 

Leave a Reply