దావోస్ లో పెరిగిన అందమైన ఆ వ్యాపారం?!

  ప్రతీ ఏటా స్విట్జర్లాండ్‌లోని అందమైన ఆల్ఫ్స్ పర్వతాల చెంన ఉండే దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగే పారిశ్రామిక ఒప్పందాల సంగతి ఎలా ఉన్నా…వ్యభిచారం…వంటి…

 దావోస్ లో పెరిగిన అందమైన ఆ వ్యాపారం?!

 

ప్రతీ ఏటా స్విట్జర్లాండ్‌లోని అందమైన ఆల్ఫ్స్ పర్వతాల చెంన ఉండే దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగే పారిశ్రామిక ఒప్పందాల సంగతి ఎలా ఉన్నా…వ్యభిచారం…వంటి అనైతిక వ్యాపారాలు మాత్రం ఏ యేటికాయేడు పెరిగిపోతున్నాయని అంతర్జాతీయ పత్రికలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వెబ్ సైట్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఖుషీలు, జల్సాలు చేసేందుకే దావోస్ సదస్సులకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచ భద్రత, నాల్గవ పారిశ్రామిక విప్లవం, వాతావరణ మార్పు వంటి అంశాలపై చర్చించడానికి 130 దేశాలకు చెందిన 3,000 మంది పారిశ్రామికవేత్తలు ఈసదస్సుకు హాజరయ్యారు. వీరు కేవలం 4 గంటల్లో రూ. 2.9 కోట్ల నుండి రూ. 9.68 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.  స్విట్జర్లాండ్‌లో వ్యభిచారం 1940ల నుండి చట్టబద్ధమైనది. దీంతో సదస్సుకు హాజరైన అనేక మంది వేశ్యలను బుక్ చేసుకున్నట్లు ఆ వార్తాకథనం వెల్లడించింది. దావోస్ సదస్సు ప్రారంభమైన నాటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 300 మంది మహిళలు, ట్రాన్స్ మహిళలను బుక్ చేసుకున్నారట. అక్కడికి వెళ్లిన వారు విపరీత కోరికలు కోరారట.  గత ఏడాది ఈసంఖ్య 170 మాత్రమే కావడం విశేషం. ఒక నివేదిక ప్రకారం కొంతమంది మహిళలు ప్రతి బుకింగ్‌కు 6వేల  franc లు డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీ విలువ రూ. 6.45లక్షలు. దావోస్ కు గతంలోనూ…ఇప్పుడు వెళ్లిన మన నాయకులు ఇలాంటి జల్సాలు చేశారో లేదో మరి..

 

 

 

Leave a Reply