• April 5, 2025

రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిన టిక్కెట్లు లేని ప్రయాణీకులు

ఈఆర్థిక సంవత్సరంలో అసలు టిక్కెట్లు లేని…సరైన టిక్కెట్లు లేని ప్రయాణీకులు జరిమానాల ద్వారా విజయవాడ రైల్వే డివిజన్ కు రికార్డు స్థాయి ఆదాయాన్ని తేవడం విశేషం. 2024-25లో…

 రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిన టిక్కెట్లు లేని ప్రయాణీకులు

ఈఆర్థిక సంవత్సరంలో అసలు టిక్కెట్లు లేని…సరైన టిక్కెట్లు లేని ప్రయాణీకులు జరిమానాల ద్వారా విజయవాడ రైల్వే డివిజన్ కు రికార్డు స్థాయి ఆదాయాన్ని తేవడం విశేషం. 2024-25లో దాదాపు 10లక్షల మంది టిక్కెట్టు లేని, సరైన టిక్కెట్లు లేని ప్రయాణీకుల నుంచి రూ. 6.03 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇది విజయవాడ డివిజన్ చరిత్రలోనే రికార్డు అని వెల్లడించారు. గత ఏడాది ఇదే సమయంలో రూ. 60.1 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే టిక్కెట్టు లేని ప్రయాణీకుల సంఖ్య పెరిగినట్లు భావించాల్సి ఉంటుంది. ఈఏడాది ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాకు కూడా రైల్వేకు కలిసివచ్చినట్టుంది.
టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారిని, రిజర్వేషన్లు లేకుండా ఎసి, ఇతర రిజర్వ్ బోగీల్లో ప్రయాణించే వారిని గుర్తించేందుకు రైల్వే శాఖ కమర్షియల్ విభాగం టిక్కెట్ల పరిశీలనతో పాటు, ఆకస్మిక తనిఖీలు జరుపుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10లక్షల మంది టిక్కెట్లు లేని, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వారిని అధికారులు గుర్తించి, జరిమానాలు విధించారు. వీరి సంఖ్య ఇది గత సంవత్సరం కంటే 6.5శాతం పెరగడం గమనార్హం. టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన వారిపై 4.5లక్షల కేసులు నమోదు చేసి, రూ. 37.17 కోట్లు జరిమానా విధించారు. అలాగే 5.13లక్షల మంది అక్రమ ప్రయాణీకులను గుర్తించి, రూ. 24.69 కోట్ల జరిమానా విధించారు. అధిక, బుక్ చేయని లగేజీకి సంబంధించి 10,412 కేసులు నమోదు చేసి, రూ. 19.46లక్షల జరిమానా విధించారు. టిక్కెట్ల తనిఖీ ద్వారా రికార్డు స్థాయి ఆదాయాన్ని రాబట్టిన విజయవాడ డివిజన్ డిసిఎం వావిలపల్లి రాంబాబు, ఆయన బృందాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ. పాటిల్ అభినందించారు.

Leave a Reply