పాకిస్తాన్ కు అంత సీన్ లేదు……తేల్చేసిన ఉండవల్లి

భారతదేశంతో యుద్దం చేసే శక్తి పాకిస్తాన్ కు లేదని, ఈ విషయం భుట్టోను ఉరితీసిన సైనిక అధిపతి అప్పట్లోనే స్పషం చేసారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ…

 పాకిస్తాన్ కు అంత సీన్ లేదు……తేల్చేసిన ఉండవల్లి

భారతదేశంతో యుద్దం చేసే శక్తి పాకిస్తాన్ కు లేదని, ఈ విషయం భుట్టోను ఉరితీసిన సైనిక అధిపతి అప్పట్లోనే స్పషం చేసారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ స్పష్టం చేశారు. యుద్దం అంటూ జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఎపికి అన్యాయంపై తాను కేసు వేసి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టకూడదని, ఎందుకంటే, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ మద్దతుని నిలబెట్టుకోవాలన్నారు. కాశ్మిరులో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్న తరుణంలో పర్యాటకులకుపై పహాల్గమ్ లో ఉగ్రవాదులు చేసిన దాడి విస్మయం కల్గించిదని అరుణ్ కుమార్ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని పిలుపునిచ్చారు. అయితే ఈవిషయంలో ఒక వర్గాన్ని టార్గెట్ గా చేయడం తగదన హితవు పలికారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ దారుణంగా ఉంటున్నాయని విచారం వ్యక్తంచేసారు. పాకిస్తాన్ ను వ్యతిరేకించాలే తప్ప ముస్లీంలపై వ్యతిరేకత తగదన్నారు. మతం ప్రాతిపదిక అనేది బారతదేశంలో సమంజసం కానేకాదన్నారు. లౌకిక వాదమే మంచిదన్నారు. భారతదేశంతో యుద్దం చేసే శక్తి పాకిస్తాన్ కు లేదని, ఈ విషయం భుట్టోను ఉరితీసిన సైనిక అధిపతి అప్పట్లోనే స్పషం చేసారని ఉండవల్లి పేర్కొన్నారు. యుద్దం అంటూ జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందన్నారు. ప్రస్తుత తరుణంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టకూడదని, ఎందుకంటే, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ మద్దతుని నిలబెట్టుకోవాలన్నారు.

అవి తప్పుడు కేసులు…దేశవ్యాప్త చర్చ తప్పదు

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కేసుల తీరుపై ఉండవల్లి అరుణ్ కుమార్ బాంబు పేల్చారు. ఈకేసుల్లో కూటమి ప్రభుత్వం అప్రతిష్టపాలవుతుందని జోస్యం చెప్పారు. సినీనటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి, డిజి పిఎస్సార్ ఆంజనేయులపై తప్పుడు కేసులు నమోదు చేశారని అభిప్రాయపడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తపై అత్యాచారం కేసు పెట్టిన సినీనటి కాదంబరి జత్వానీ అరెస్టు, అనంతర పరిణామాలపై పూర్తి వివరాలను ముంబయ్ నుంచి సేకరిస్తున్నానని, దీనిపై దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చ జరుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే ఈకేసులు నమోదు చేయించినట్లు భావిస్తే ఆయననే అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ఒక డిజి స్థాయి అధికారిని జైలుకు పంపండం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఇలాగైతే పోలీసులు పనిచేయలేరన్నారు. ఈకేసులో పిఎస్సార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఉద్దేశంలో లేరని, బయటకు వస్తే ఆయనపై గ్రూపు-1 పరీక్షల మూల్యాంకన కేసు సిద్ధంగా ఉందని చెప్పారు. పాలనలో కక్ష సాధింపు ధోరణులు తగవన్నారు.
ఎంపీగా రెండుసార్లు పనిచేసిన సమయంలో చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్ లు తనతో సన్నిహితంగా ఉండేవారని, కొందరైతే నాకు స్నేహితులుగా మారిపోయారని అందులో పీఎస్ ఆర్ అంజనేయులు ఒకరని అందుకే ఆయనను జైలుకి వెళ్లి పరామర్శించానని ఉండవల్లి స్పష్టంచేసారు. పైగా ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. అవినీతి మరకలేని పిఎస్సార్ ఆంజనేయులు సమర్ధుడైన అధికారిగా పేరుపొందారని, గతంలో చంద్రబాబు సీఎం గ అండగా ఐదు జిల్లాల ఎస్పీగా పనిచేసి రౌడీయిజం అణచారని ఉండవల్లి కితాబునిచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఈనాడు పత్రిక కనుసన్నల్లో పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. ఈనాడుపై కన్నేసిన వారి కళ్లు పీకేస్తారన్నారు. పిఎస్సార్ విషయంలో అదే జరిగినట్లు భావిస్తున్నానన్నారు. మార్గదర్శిపై తాను కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఆయనకు తెలుసునని, జగన్ అధికారంలోకి వచ్చాక మార్గదర్శిపై దాడులు, సోదాలు ఆయన ప్రోద్భలంతోనే జరిగినట్లు ఈనాడు యాజమాన్యం భావించి ఉండవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అందుకే కాదంబరి కేసులో ఉన్న మరో ఐపిఎస్ అధికారి విశాల్ గున్నీ అప్పటి డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి అనుమతితోనే కాదంబరిని అరెస్టు చేసినట్లు వాంగ్మూలం ఇచ్చినా ఆయనను ఈకేసులో పక్కనపెట్టారన్నారు.

ఎపి ఆశాజ్యోతి పవన్…

రాష్ట్ర విభజన విషయంలో ఏపీకి జరిగిఆన్ అన్యాయంపై ఇప్పటికైనా పార్లమెంట్ లో నోటీసు ఇచ్చి చర్చ జరిపించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కోరారు. ఈవిషయంలో ఎపికి పవన్ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేసారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, వాదన ప్రారంభించి నేటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తయిందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై తప్పొప్పులు తేల్చాలని మాత్రమే తాను కోరుకుంటున్నానన్నారు. అసలు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. రాష్ట్ర విభజన తీరు, ఎపికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చించాలని 2014తర్వాత చంద్రబాబుకి, 2019తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ముందు విజయవాడలో తాను స్వయంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్సీపి, సిపిఎం పార్టీలు మినహా మిగిలిన పార్టీలకు చెందిన నాయకులంతా హాజరయ్యారని, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్ష హోదాలో పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవడంతో సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుందని, ఈనేపథ్యంలో కేంద్రప్రభుత్వానికి ఎపి తరపున ఎంపీల మద్దతు ఇచ్చినందున పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు అవుతుందన్న ఉద్దేశ్యంతో ఇటీవల లేఖ రాసినట్లు ఉండవల్లి గుర్తుచేశారు.

Leave a Reply