• January 27, 2025

హేవలాక్ పై…గంతులు వేయచ్చు…త్వరలో పట్టాలెక్కనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు…

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకరంగంలో తనదైన ముద్ర వేసేందుకు రాజమహేంద్రవరం నగరానికి చెందిన పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్ నడుంబిగించారు. రానున్న ఐదేళ్లలో ఎపిని పర్యాటకరంగంలో అగ్రగామికి…

 హేవలాక్ పై…గంతులు వేయచ్చు…త్వరలో పట్టాలెక్కనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు…

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకరంగంలో తనదైన ముద్ర వేసేందుకు రాజమహేంద్రవరం నగరానికి చెందిన పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్ నడుంబిగించారు. రానున్న ఐదేళ్లలో ఎపిని పర్యాటకరంగంలో అగ్రగామికి తీర్చిదిద్దుతామని ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. 2027 గోదావరి పుష్కరాలలోగా కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ ద్వారా రూ. 98కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టామన్నారు. అందులో భాగంగా పూర్తిగా అధ్యాత్మిక వాతావరణం తలపించేలా పుష్కరాలరేవులను అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని ఘాట్లను కలిపేలా బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిష్టాత్మక హేవలాక్ వంతెనను ఆధునికీకరిస్తామని, 2.7 కి.మీ వంతెనపై ఒక్కొక్కటి 48 మీటర్ల విస్తీర్ణంలో 57 స్పాన్ లకు గానూ 18 స్పాన్స్ పై పర్యాటక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. కడియం నర్సరీని మరింత అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేందుకు థీమాటిక్ జోన్ లు, వాటర్ స్పోర్ట్స్ లు, క్యాస్కేడింగ్ ఫౌంటెన్ డిజైన్లు, లైట్ అండ్ సౌండ్ షోలు, జలపాతాలు, గాజు వంతెనలు , ట్రెజర్ హంట్స్, వీడియో గేమ్స్, ఇంటరాక్టివ్ ఫన్, గేమింగ్ జోన్ లు ఏర్పాటుచేస్తామన్నారు. అంతేగాక ప్లానిటోరియం స్పేస్ థీమ్, క్రాఫ్ట్ బజారులు, హ్యాంగింగ్ గార్డెన్ లు, హాలో గ్రామ్ జూ, ఏఐ టెక్నాలజీతో టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్, బఫర్ స్పేస్ లు, టాయ్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నామన్నారు. బ్రిడ్జిలంక ఐల్యాండ్ లో ఈవెంట్ స్పేస్ లు ఏర్పాటు చేసి తపోవనం పేరుతో అభివృద్ధి చేస్తామన్నారు. నిడదవోలు కెనాల్ ను ఆధునికీకరించి ఒకవైపు రెస్టారెంట్లు, మరోవైపు రిసార్ట్స్ లతో అభివృద్ధి చేస్తామన్నారు. అదే విధంగా ప్రఖ్యాతిగాంచిన కోట సత్తెమ్మ ఆలయాన్ని ఆధునికీకరించి వసతి సౌకర్యాలు పెంచి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రధానంగా ప్రతిష్టాత్మక హేవలాక్ వంతెనను ఆధునికీకరిస్తాం..2.7 కి.మీ వంతెనపై ఒక్కొక్కటి 48 మీటర్ల విస్తీర్ణంలో 57 స్పాన్ లకు గానూ 18 స్పాన్స్ పై పర్యాటక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అన్ని ఘాట్లను కలిపేలా బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కడియం నర్సరీని మరింత అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేందుకు థీమాటిక్ జోన్ లు, వాటర్ స్పోర్ట్స్ లు, క్యాస్కేడింగ్ ఫౌంటెన్ డిజైన్లు, లైట్ అండ్ సౌండ్ షోలు, జలపాతాలు, గాజు వంతెనలు , ట్రెజర్ హంట్స్, వీడియో గేమ్స్, ఇంటరాక్టివ్ ఫన్, గేమింగ్ జోన్ లు ఏర్పాటుచేస్తామన్నారు. అంతేగాక ప్లానిటోరియం స్పేస్ థీమ్, క్రాఫ్ట్ బజారులు, హ్యాంగింగ్ గార్డెన్ లు, హాలో గ్రామ్ జూ, ఏఐ టెక్నాలజీతో టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్, బఫర్ స్పేస్ లు, టాయ్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నామన్నారు. బ్రిడ్జిలంక ఐల్యాండ్ లో ఈవెంట్ స్పేస్ లు ఏర్పాటు చేసి తపోవనం పేరుతో అభివృద్ధి చేస్తామన్నారు. దీనికి సంబంధించి 2-3రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. చరిత్రాత్మకమైన గండికోటను అద్భుత రీతిలో తీర్చిదిద్దనున్నామన్నారు. చారిత్రక ప్రాశస్త్యం కోల్పోకుండా గండికోటను పూర్తిగా ఆధునికీకరించి, వసతి కల్పనతో పాటు సహజ ప్రకృతి సౌందర్యాలను తిలకించే విధంగా ఏర్పాట్లు  చేయనున్నామన్నారు. టెండర్లు ఇప్పటికే పిలిచామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రూ. 100 కోట్లతో సూర్యలంక బీచ్ ను మరింత సుందరంగా అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇప్పటికే డీపీఆర్ లు కేంద్రానికి పంపించామన్నారు. అన్నవరంలో రూ.25 కోట్లతో ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరై టెండర్లు పిలిచామన్నారు.

పీ4 విధానంలో రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి చేపడుతున్నామని  మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టూరిజం సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. సింగిల్ విండో విధానంలో ఇన్వెస్టర్లకు త్వరితగతిన అనుమతులు ఇస్తామని చెప్పారు. పరిశ్రమకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకానికి కూడా వర్తింపజేస్తామన్నారు. అమరావతి రాజధానిలో రివర్ ఫ్రంట్ ను రూ. 500కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఎపిలో నూతన ఫిల్మ్ పాలసీ తెచ్చే దిశగా చర్యలు చేపట్టామన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టూరిజం సర్క్యూట్ లు, యాంకర్ హబ్ లు తదితర విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. ఎపిలో పెట్టుబడులకు  తాజ్, ఒబెరాయ్, మేఫేర్, ఐఆర్ సీటీసీ సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పారు.

త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్

తొలుత మారేడుమిల్లి ఉత్సవ్ ప్రారంభించి స్థానికంగా ఉన్న అవకాశాలను ఇన్వెస్టర్లకు తెలిపి తద్వారా మారేడుమిల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అరకు సమీపంలోని టైడా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖతో సమస్య వస్తే ఉప ముఖ్యమంత్రి,అటవీ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా సబ్ కమిటీలో చర్చించి సంబంధిత ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు క్లియరెన్స్ ఇప్పించారన్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా పాపికొండల టూర్ విషయంలో భద్రతా ప్రమాణాల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. పాపికొండలు యాత్రను మరింత మెరుగుపర్చనున్నామన్నారు.. పర్యాటకుల భధ్రత తమ తొలి ప్రాధాన్యమన్నారు.. ఒక్కరోజు పర్యటనకు వచ్చిన పర్యాటకులు 5రోజుల వరకు ఎపిలోనే గడిపేలా ఆకట్టుకునే ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని దుర్గేష్ వివరించారు. ఉదాహరణకు సింహాచలం లక్ష్మీ నర్సింహ్మస్వామి దర్శనానికి వచ్చే పర్యాటకుడు సమీపంలోని బ్లూఫాగ్ సర్టిఫికెట్ పొందిన రుషికొండ బీచ్ ను సందర్శించేలా, అరకు వ్యాలీ సందర్శించేలా టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే బొర్రా గుహల ఆధునికీకరణకు నిధులు మంజూరు అయ్యాయయన్నారు. అదే విధంగా శ్రీశైలం వచ్చే పర్యాటకుడు స్థానికంగా ఉండే  రోప్ వే, టైగర్ రిజర్వ్, వాటర్ ఫాల్ చూసే విధంగా, వసతి కోసం రిసార్ట్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Leave a Reply