ఆపే దమ్ము వారికి లేదు…కానీ అందులో దమ్మెంతే వీరు తేల్చేస్తారు!

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ జూన్ 12న విడుదల కావాల్సింది. అయితే సినిమా కొనుగోలు పట్ల డిస్టిబ్యూటర్లు…

 ఆపే దమ్ము వారికి లేదు…కానీ అందులో దమ్మెంతే వీరు తేల్చేస్తారు!

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ జూన్ 12న విడుదల కావాల్సింది. అయితే సినిమా కొనుగోలు పట్ల డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాల వల్ల విడుదల వాయిదాపడినట్లు సమాచారం. ఈచిత్ర భవిష్యత్ కోసం అటు పవన్ అభిమానులతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు, ధియేటర్ యజమానులు, రాజకీయ పార్టీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీకి ముందు జరిగిన పరిణామాలే ఇందుకు కారణం. ధియేటర్ల నిర్వహణ గిట్టుబాటు కావడం లేదని, పర్సంటేజీల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 1వ తేదీ నుంచి ధియేటర్లు బంద్ చేయాలని ధియేటర్ల యజమానులు అనుకున్నారట. ఈవిషయం తెలిసిన పవన్ తన సినిమా కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించడం, మరోవైపు ధియేటర్లలో తనిఖీలకు ఆదేశించడంతో హరిహర వీరమల్లు విడుదల వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎపి సినిమాటోగ్రఫీ, పర్యాటకశాఖ మంత్రి, జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ దీని వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని ఏకంగా హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన పార్టీ నేత, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకుడు అత్తి సత్యనారాయణే బంద్ కు ప్రతిపాదించారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో ఆరోపించడంతో అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈవ్యవహారంలో పాపం సత్యనారాయణ బలిపశువుగా మారారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమాను ఆపే దమ్మూ ధైర్యం తమకు లేవని మూకుమ్మడిగా సినీ ప్రముఖులు, ధియేటర్ల యజమానులు ప్రకటించడంతో ప్రస్తుతానికి పవన్ శాంతించినట్లు కనిపిస్తోంది. అయితే సినిమాలో దమ్మెంత ఉందన్నది జూన్ 12న ప్రేక్షకులు తేల్చేస్తారు.
అయితే తన సినిమా కోసం పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు మాత్రం విమర్శలకు దారితీసేదిగా ఉంది. అలాగే ఆయన గతాన్ని మర్చిపోయినట్లు కూడా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చే ఆలోచనలో ఉందని తాము అధికారంలోనికి వచ్చి సంవత్సరం అవుతున్నా, సినిరంగ ప్రముఖులు చంద్రబాబు ను ఎందుకు కలవలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీరంగ ప్రముఖుడైన పవన్ కు నిజంగా సినిరంగంపై అభిమానం, అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష ఉంటే సినీరంగ సమస్యలపై చర్చించేందుకు సిఎం బావమరిది, ఎమ్మెల్యే కూడా బాలకృష్ణ, తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, ఇతర సినీరంగ ప్రముఖులతో కలిసి చంద్రబాబునాయుడుతో సమావేశానికి తానే చొరవ చూపిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదే పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి, ఇతర నటులు వైసిపి అధినేత, నాటి ముఖ్యమంత్రి జగన్ ని 2022 లో కలిసినపుడు, సినిమావారిని జగన్ అవమాన పరిచారని విమర్శించారు. బీమ్లా నాయక్ రిలీజ్ సందర్భంగా జగన్ ఏకంగా కలెక్టర్ లను పంపి తనిఖీ చేయించారు. జగన్ కు నాకు తేడా లేదన్నట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. అలాగే సొంతంగా డబ్బు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాత లపై ప్రభుత్వం పెత్తనం ఏమిటని అప్పుడు ప్రశ్నించిన పవన్ ఇప్పుడు సినిమా వాళ్ళను, టికట్లు పెంపుకోసం వ్యక్తిగతంగా ఎవ్వరిని కలవనని, అసోసియేషన్ పరంగా వస్తేనే కలుస్తానని స్పష్టం చేయడం బెదిరింపు ధోరణిగా కనిపిస్తోంది. ఇంతకీ తన సినిమాకు టిక్కెట్ ధరల పెంపుదల విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply