• November 25, 2024

రోడ్ల విస్తరణ…ఇన్నర్…ఔటర్ రింగ్ రోడ్లు….రుడాకు కొత్త మాస్టర్ ప్లాన్

రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(రుడా)కు 2041 సంవత్సరం నాటి అవసరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. వారంలోగా కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం…

 రోడ్ల విస్తరణ…ఇన్నర్…ఔటర్ రింగ్ రోడ్లు….రుడాకు కొత్త మాస్టర్ ప్లాన్

రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(రుడా)కు 2041 సంవత్సరం నాటి అవసరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. వారంలోగా కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని రుడా వైస్ చైర్మన్, నగరపాలకసంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని 23 రోడ్లను 60-100 అడుగుల వరకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేస్తున్నారు. 2021లో గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. దీనిపై దాదాపు 1200కు పైగా అభ్యంతరాలు, సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తాజాగా దీనిపై ప్రజలు, బిల్డర్లు, ఆయా పంచాయితీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి, సలహాలు, సూచనలు కోరారు. 3వేల 156 చదరపు కిలోమీటర్ల రుడా పరిధిలో 18 పంచాయితీలతో కూడిన 162 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. ఈగ్రామాలను జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ పరిధిలోకి తెస్తారు. కొత్త మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్ల విస్తరణ, స్నానఘట్టాల విస్తరణ చేస్తారు. దివాన్ చెరువు-ఎయిర్ పోర్టు-కడియం వరకు నగరానికి వలయాకారంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి దాదాపు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో  సుమారు రాజానగరం నుంచి వలయాకారంలో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇప్పటికే అమృత్ సిటీగా కేంద్ర గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కొత్త మాస్టర్ ప్లాన్ ను అమలు చేయడం ద్వారా కేంద్రం నుంచి మంచినీటి సరఫరా, మౌలికవసతుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 

Leave a Reply