ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎపి పార్టీలు ఎటు వైపు?.. మూడు పార్టీలు మోడీ తానులో ముక్కలేనా?!

ఉపరాష్ట్రపతి. ఎన్నికలలో అధికార పక్షానికి ఆంధ్రులుగా తెలుగువారిగా మనం ఓటు ఇచ్చినా. .ఇవ్వకపోయినా…. ప్రస్తుత పరిస్థితుల్లో బహుశా అధికార బీజేపీ ఎన్డీఏ కూటమి వారు గెలుస్తారేమో. ఈ…

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎపి పార్టీలు ఎటు వైపు?.. మూడు పార్టీలు మోడీ తానులో ముక్కలేనా?!

ఉపరాష్ట్రపతి. ఎన్నికలలో అధికార పక్షానికి ఆంధ్రులుగా తెలుగువారిగా మనం ఓటు ఇచ్చినా. .ఇవ్వకపోయినా…. ప్రస్తుత పరిస్థితుల్లో బహుశా అధికార బీజేపీ ఎన్డీఏ కూటమి వారు గెలుస్తారేమో. ఈ పరిస్థితుల్లో మన ఆంధ్రా పార్టీ లు కూడా ఎప్పటిలాగే. మోడీ పక్షానికి ఒరిగిపోకుండా. ఒంగిపోకుండా రాజకీయ వ్యూహాలు. మనుగడ. నిష్పక్షపాతం. సెంటిమెంట్ . .పార్టీలకు చివరి ప్రాధాన్యమైన ప్రజల డిమాండ్, అవసరాలు,మనోభావాలు తదితర అన్ని అంశాలు విశ్లేషణ చేసుకుని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఆ రకమైన తెగువ మన తెలుగు పార్టీలకు లేదనే చెప్పుకోవాలి.. ఎప్పుడైనా ప్రజాప్రయోజనాల కన్నా, రాష్ట్ర ప్రయోజనాల కన్నా పార్టీలు వారి సొంత ప్రయోజనాలు, అవకాశవాదానికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ప్రజల సెంటిమెంట్ ను పార్టీలు గౌరవించడం అనేది అత్యాశ గానే కనిపిస్తుంది. అలా చూస్తే బిజెపి అధిష్టానం తో చెడకుండా. మోడీ మనసు బాధ పడకుండా అడుగులకు మడుగులెట్టడంలో పోటీపడే మన తెలుగు పార్టీలు నేటి తమ స్థాయిలకు తెలుగువారు చూపిన అభిమాన ఆశీస్సులే అని గుర్తించి, తమ భాద్యతలు మరువక రాష్ట్ర ప్రయోజనాలైన విశాఖ ఉక్కు, విభజన హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర విశేష సహకారం ఆశించడంలో, లౌక్యంగా ప్రశ్నించడం తప్పులేదు. అందులో భాగంగా కేంద్రంతో రాష్ట్ర పార్టీలు తమ సత్సంబంధాలు చాప కింద నీరులా కొనసాగించాలి అంటే…ప్రస్తుతం భాజపా, ఎన్టీఏ పార్టీల ఉపరాష్ట్రపత్ ఖాయంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. . ఇప్పటికే మేము ఎన్డీఏ కూటమికి మద్దతు గా ఓటు వేసినా. . వేయకున్నా ప్రత్యేకంగా నష్టపోయేది లేదు కనుక రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఈసారి మేము అధికార ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు ఇస్తాం అని లోపాయికారిగా చెప్పగలిగే సత్తా తెలుగుదేశం, వైసీపీ, జనసేన లలో ఒక్కదానికీ లేనట్టే ఉంది. కనీసం తమ ఆంధ్రా రాష్ట్ర వేదన,రోధన గట్టిగా చెప్పడానికి అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేక ఓటు కాదుకదా కనీసం ఎవరికీ ఓటు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోతాం అని గట్టిగా ఒక్క ఆంధ్రా పార్టీ కూడా చెప్పలేని దీనావస్థలో ఉన్నాయి. తెలుగుదేశం, వైకాపా అధ్యక్షులు తమ మీద పై కత్తిలా ఉన్న కేసుల కోసం, బీజేపీ నాయకత్వాన్ని పట్టుకుని వేలాడితే ఉన్నత పదవి వచ్చే అవకాశం కోసం జనసేన అధ్యక్షుడు అంతిమంగా ఎవరి స్వార్థ ప్రయోజనాలతో వారు అవకాశవాద రాజకీయాలతో మోడీ ముందు సాగిలపడితుండటం తెలుగు ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఇండియా కూటమి అభ్యర్థి గా కాదు. నిజాయితీ, నిబద్ధత తో చట్టం తెలిసిన అనుభవశీలి . .తెలుగు వారు. కనుక ప్రముఖ అత్యున్నత న్యాయస్థాన మాజీ న్యాయమూర్తి సుదర్శన రెడ్డి కి ఓటు వేసేలా అడుగులు వేస్తున్నాం అనే ధీరత్వం మన తెలుగు పార్టీలలో, చంద్రబాబు, జగన్ , పవన్ లలో ఒక్కరికీ లేదు. ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా మా ఆంధ్రా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము తెలుగు అభ్యర్థికి మద్దతుగా ఓటు ఇస్తున్నామని ,లేదా తటస్థంగా ఎవరికీ ఓటు వేయకుండా నిర్ణయం తీసుకున్నామని ప్రతిపక్ష వైసిపి గానీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా ప్రకటించే సాహసం చేయక, అంతిమంగా టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు మోడీ తానులో ముక్కలులాగే వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తుంది. భాజపా పార్టీ అంచనాలకు మించి పలుమార్లు రాజ్యసభ. .లోక్ సభలలో పలు బిల్లులకు ఎప్పటికపుడు తెలుగు పార్టీలుగా మా వంతు మద్దతు గట్టిగానే ప్రకటిస్తూనే ఉన్నాం కదా. ఈసారి తెలుగు వ్యక్తి కి మద్దతు గా ఓటు ఇస్తాం లేదా తటస్థంగా ఉండిపోతాం అనలేరా, కేవలం మైకుల ముందు, మీడియాముందు చెలరేగిపోవడం తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు వారి ఆత్మగౌరవం వంటివి మన. ఆంధ్రా పార్టీలకు కనీసం పట్టవని విద్యావంతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసం కనీస సమయస్పూర్తి, తెగువ చూపకుండా, బీజేపీ నాయకత్వానికి కోపం తెప్పించకుండా ఒక్కసారైనా పాము చావనట్టు. .కర్ర విరగనట్టు. మెజారిటీ తెలుగు ప్రజలకు నచ్చినట్టు లౌక్యంగా దూరాలోచనతో మన తెలుగు పార్టీలు అడుగులు వేయకుండా మోడీ షా భజనలో తాము ఎక్కడ వెనకబడిపోతామో అనే ధ్యాస తప్ప తెలుగు పార్టీలు నుంచి కేంద్రాన్ని ప్రశ్నించడం అనేది ఈ మూడు పార్టీల డిక్షనరీ లోనే లేనట్టుగా ఉందని అనిపిస్తుంది. కపిస్తుంది. మా మనుగడ కోసం..మా తెలుగు ప్రజల సెంటిమెంట్ కోసం అనేలా. సమర్ధవంతంగా*చెప్పుకోగలిగే నేర్పు యుక్తి ఉన్నా అసలు ఆ దిశగా ఆలోచన, ప్రయత్నాలు మన ఆంధ్రప్రదేశ్ పార్టీలలో కనీసం కనపడకపోవడం బాధాకరం. …. అంతిమంగా ఏపీ లో పార్టీలన్నీ భాజపా మోడీ షా కి మిత్రపక్షాలే అనేది జనమెరిగిన సత్యం. అదే ఆంధ్రా ప్రజల ప్రయోజనాలకు శాపం గా. .భాజపా కు వరంగా మారినట్లు కనిపిస్తున్నాయి.

కొవ్వూరి ధర్మారెడ్డి
క్రియాశీలక సామాజిక సేవకుడు
రాజకీయ విశ్లేషకుడు

Leave a Reply