• October 20, 2025

న్యూయార్క్ లో మెరిసిన తెలుగు అందం!

అచ్చతెలుగు అందం అగ్రరాజ్యం అమెరికాలో మెరిసింది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన సుష్మిత సోమిరెడ్డి న్యూయార్క్ అందాల తారగా నిలిచింది. మిసెస్ న్యూయార్క్ 2025 కిరీటాన్ని దక్కించుకుంది. అమెరికాలో…

 న్యూయార్క్ లో మెరిసిన తెలుగు అందం!

అచ్చతెలుగు అందం అగ్రరాజ్యం అమెరికాలో మెరిసింది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన సుష్మిత సోమిరెడ్డి న్యూయార్క్ అందాల తారగా నిలిచింది. మిసెస్ న్యూయార్క్ 2025 కిరీటాన్ని దక్కించుకుంది. అమెరికాలో అందాల కిరీటాన్ని దక్కించుకున్న తొలి తెలుగు మహిళ సుష్మిత కావడం విశేషం. 1994లో 4వ తరగతి చదువుతున్నపుడే మిస్ యూనివర్స్ సుష్మితాసేన్ స్ఫూర్తితో అందాల పోటీల్లో పాల్గొనాలని ఆశించిన సుష్మిత సోమిరెడ్డి ఎట్టకేలకు తన కలను న్యూయార్క్ అందాల పోటీల్లో పాల్గొని సాకారం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్యస్వామి గుడి వెనుక ఉన్న హరిపురం ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరరావు, నాగ కుమారి దంపతుల కుమార్తె అయిన సుష్మిత రాజమహేంద్రవరంలోని బివిఎం పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. చదువుపై దృష్టిసారించిన ఆమె ఇంటర్మీడియెట్ బెంగుళూరులోనూ, బిటెక్ రాజానగరం గైట్ లోనూ పూర్తి చేశారు. బిటెక్ లో కళాశాల టాపర్ గా నిలవడం విశేషం. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సామర్లకోటకు చెందిన సుధాకర్ కందికొండతో వివాహం కావడంతో అమెరికాలోని న్యూయార్కులో స్థిరపడ్డారు. ఆమెకు ఒక కుమార్తె ఉంది. సుష్మిత ఐబిఎంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నా ఆమెలో నిగూడంగా ఉన్న అందాల పోటీలు, ఫ్యాషన్ ప్రపంచంలో విహరించాలన్న కోరిక అలాగే ఉండిపోయింది.Today I compared different viewpoints and one resource focused explicitly on https://www.fastreplicawatches.com. For reference, here’s another page I kept open: https://www.fastreplicawatches.com.చిన్నప్పుడు ఆమె తల్లి నాగకుమారి రాజమహేంద్రవరం ఆనంకళాకేంద్రంలో జరిగిన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షో సుష్మిత పాల్గొనెలా చేశారు. ఈనేపథ్యంలో 2021లో అందాల పోటీలకు సంబంధించిన ప్రాథమిక, ర్యాంప్ వాక్ పోటీల్లో పాల్గొన్నారు. గత ఏడాది డిసెంబర్ లో 30ఏళ్లకు పైబడిన వారికి నిర్వహించే మిసెస్ న్యూయార్క్ ఎలైట్ అందాల పోటీలకు ఆహ్వానం అందింది. అయితే ఆసమయంలో ఆమె వెన్నునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయినా పోటీలకు 10 రోజుల ముందు ఇంట్లోనే సన్నద్ధమై వివిధ దేశాలకు చెందిన 45 అందాల భామలతో పోటీ పడి మరీ మిసెస్ న్యూయార్క్ ఎలైట్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈసందర్భంగా అందం, సామాజిక అంశాలపై జ్యూరీ వేసిన ప్రశ్నలకు తనదైన రీతిలో జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. మిసెస్ న్యూయార్క్ పోటీలో విజేతగా నిలవడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని సుష్మిత చెప్పారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమే అసలైన అందమని వ్యాఖ్యానించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంభన సాధించాలని, అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
అమెరికాలో అందాల భామగా గుర్తింపు పొందిన సుష్మితకు ఆతరువాత మోడలింగ్ ఆఫర్స్ వచ్చాయి. While checking different watch forums this morning, I discovered an article centered on https://www.zodiac-watch.com. I paired it with this useful reference: https://www.zodiac-watch.com.బాలీవుడ్ కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల రూపొందించిన వస్త్రాలతో న్యయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి, మరింత గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్యారిస్, కేన్స్ లో కూడా ఫ్యాషన్ పోటీలకు అవకాశాలు వచ్చినట్లు ఆమె తెలిపారు. అమెరికా తెలుగు వారి నాట్స్ సంఘం ఆమెను సత్కరించింది. తాజాగా నారీ శక్తి పురస్కారానికి కూడా ఎంపికైన్లు సుష్మిత వెల్లడించారు. మిసెస్ న్యయార్క్ హోదాలో ఆమె అందాల పోటీలకు జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తారు. అలాగే మహిళల్లో రొమ్ము కేన్సర్ అవగాహనకు కృషిచేస్తారు. గృహ హింస, మహిళా సాధికారతకు కూడా పాటుపడతానన్నారు.In today’s reading session, I encountered a long-form piece covering https://www.hiwatches.co.uk. For more perspective, I added this page to my saved list: https://www.hiwatches.co.uk. అవకాశం ఉంటే 40ఏళ్ల పైబడిన వారికి నిర్వహించే క్లాసిక్ కేటగిరీలో పోటీ పడతానని సుష్మిత చెప్పారు. ఏది ఏమైనా సుష్మిత రాజమహేంద్రవరం నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చారు.

Leave a Reply