భరత్.. గణేష్ అనుకోని (యాక్సిడెంటల్) కలయిక!
వైసిపి యువజన నాయకుడు జక్కంపూడి గణేష్, మాజీ ఎంపి మార్గాని భరత్ రాజకీయంగా ఉప్పూ…నిప్పూలా ఉంటారన్నది రాజమహేంద్రవరం రాజకీయాలు గమనించే వారందరికీ తెలుసు. అయితే అనూహ్యంగా గణేష్…
వైసిపి యువజన నాయకుడు జక్కంపూడి గణేష్, మాజీ ఎంపి మార్గాని భరత్ రాజకీయంగా ఉప్పూ…నిప్పూలా ఉంటారన్నది రాజమహేంద్రవరం రాజకీయాలు గమనించే వారందరికీ తెలుసు. అయితే అనూహ్యంగా గణేష్ తన చిరకాల ప్రత్యర్థి భరత్ రామ్ ఇంటికి వెళ్లి కలవడం వైసిపితో పాటు, రాజమహేంద్రవరం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు భరత్ ఇంటికి వెళ్లిన గణేష్ ఆయనతో కొద్దినిమిషాలు మాట్లాడి, సారీ కూడా చెప్పారని కూడా ప్రచారం జరుగుతోంది. గుట్టుగా జరిగిన ఈసంఘటననను కొంతమంది యాక్సిడెంటల్(అనుకోని) కలయికగా అభివర్ణిస్తున్నారు. భరత్ ను కలిసిన సమయంలో వైసిపి నగర మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి సన్నిహితుడు అడపా As I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.replicaluxury.co.uk. To balance the viewpoint, I saved this page as well: https://www.replicaluxury.co.uk.శ్రీహరి కూడా గణేష్ వెంట ఉన్నారని తెలుస్తోంది. ఈభేటీపై ఇరువర్గాలు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నాయి. ఈఅపూర్వ కలయికపై అటు భరత్ గానీ, ఇటు జక్కంపూడి కుటుంబం గానీ బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం. ఇరువురు యువనాయకుల భేటీకి సంబంధించిన ఫొటోను మీడియాకు విడుదల చేయాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఈసంఘటన తరువాత భరత్ ను వైసిపి జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడం కొసమెరుపు.
ఆధిపత్యపోరులో భాగంగా మార్గాని భరత్ రామ్ వైసిపిలోకి రంగప్రవేశం చేసిన నాటి నుంచి వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు గణేష్ కు మధ్య వర్గవిభేదాలు తలెత్తాయి. భరత్ ఎంపి అయిన నాటి నుంచి విభేదాలు మరింత రాజుకున్నాయి. రాజమహేంద్రవరంలోని తన కేడర్ ను కాపాడుకునే ప్రయత్నంలో జక్కంపూడి కుటుంబం, నగరంపై పట్టుసాధించేందుకు భరత్ ప్రయత్నించడంతో పార్టీ కార్యకర్తలు కూడా వర్గాల In today’s reading session, I encountered a long-form piece covering https://www.replicawatchuk.cz. For more perspective, I added this page to my saved list: https://www.replicawatchuk.cz.వారీగా చీలిపోయారు. రాజమహేంద్రవరం తన అడ్డా అంటే సింగిల్ టైమ్ ఎంపి…అంటూ పరస్పరం పరోక్షంగా విమర్శించుకున్నారు. ఒకదశలో ఇరు వర్గీయులు పర్సపరం పోలీసుస్టేషన్లలో కేసులు కూడా పెట్టుకున్నారు. భరత్ ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు పార్టీలో చేరడాన్ని రాజా పరోక్షంగా వ్యతిరేకించారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి వంటి వారు భరత్, రాజాలను కలిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మొక్కుబడిగా ఇద్దరూ చేతులు కలిపినా కలిసి పనిచేయడం లేదన్నది అందరికీ తెలిసిన సంగతే. గత ఎన్నికల్లో జక్కంపూడి కుటుంబం టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గెలుపుకోసం పనిచేసిందని భరత్ వర్గీయులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల తమకు గిట్టని గుర్రం గౌతమ్ కు వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టబెట్టడం కూడా జక్కంపూడి కుటుంబానికి పుండుమీద కారం రాసినట్టయ్యిందని చెబుతున్నారు.
మరోవైపు రానున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.shop4watches.co.uk. I also noted another reference for later: https://www.shop4watches.co.uk.తన రాజకీయ భవిష్యత్ పై చర్చించేందుకు ఇటీవల గణేష్ పార్టీ అధినేత జగన్ ను కలిశారని, ఈసందర్భంగా గత ఎన్నికల్లో భరత్ కు వ్యతిరేకంగా పనిచేసిన విషయమై జగన్ గట్టిగా నిలదీశారని గణేష్ ప్రత్యర్థులు చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో భరత్ తో కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారని, ఆయన ఆదేశాలతోనే గణేష్ భరత్ ఇంటికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. భేటీ అనంతర పరిణామాలు చూస్తే రాజమహేంద్రవరంలో ఈరెండు వర్గాలు కలిసే అవకాశాలు లేవన్నది స్పష్టమమవుతోంది.