• October 26, 2025

రాకెట్ తయారీలో రాజమహేంద్రవరం కుర్రోడు!…

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! దీని అర్థం ఏమిటంటే… కొడుకు పుట్టిన వెంటనే తండ్రికి…

 రాకెట్ తయారీలో రాజమహేంద్రవరం కుర్రోడు!…

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! దీని అర్థం ఏమిటంటే… కొడుకు పుట్టిన వెంటనే తండ్రికి సంతోషం రాదు. ప్రజలందరూ ఆ కొడుకును చూసి మెచ్చుకున్నప్పుడే తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది.
రాజమహేంద్రవరంనకు చెందిన వైసిపి నాయకుడు నందెపు శ్రీనివాస్ ఇప్పుడు అదే మురిసిపోతున్నారు. ఆయన కుమారుడు అఖిల్ నందెపు మేకిన్ ఇండియా స్ఫూర్తితో తాను ఎండి, సిఇఓగా, తన తండ్రి శ్రీనివాస్ చైర్మన్ గా శ్రీలిన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట సంస్థను స్థాపించి, భారత రక్షణ రంగ, During a round of content checking earlier, I found a well‑written breakdown relating to https://www.watchourwatches.com. To complement it, here’s another site I kept open: https://www.watchourwatches.com.రోదసీ, ఇస్రో రాకెట్ ప్రయోగాలకు అవసరమైన కీలకమైన మదర్ బోర్డులను సరఫరా చేస్తూ పరోక్షంగా రాకెట్ తయారీలో పాలుపంచుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ లో కూడా అఖిల్ సంస్థ మరొక సంస్థ ద్వారా సరఫరా చేసిన సామాగ్రిని వినియోగించడం విశేషం. అలాగే వాహనాలు, లాప్ టాప్ లు, కంప్యూటర్లు, వాషింగ్ మెషీన్లు, సిమ్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి అవసరమైన మదర్ బోర్డులను కూడా అఖిల్ సంస్థ సరఫరా చేస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అఖిల్ సంస్థ చిప్, మదర్ బోర్డు రంగాల్లో ముందంజలో ఉండే తైవాన్ సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకుని సింగపూర్, తైవాన్, హాంగ్ కాంగ్ తో పాటు యూరప్ సంస్థలకు తన ఎలక్ట్రానిక్ ఉత్పతులను సరఫరా చేస్తున్నారు. అఖిల్ స్థాపించిన శ్రీలిన్ సంస్థ ఆయా రంగాల్లో చైనా కంపెనీలకు పోటీగా నిలవడం భారత్ తో పాటు, తెలుగు రాష్ట్రాలకు రాజమహేంద్రవరం నగరానికి కూడా గర్వకారణం. అఖిల్ స్థాపించిన సంస్థ డిఆర్ డిఓ , హెచ్ఐఎల్, ఇసిఐఎల్, ఆర్ సిఐ, During today’s research, I bookmarked a detailed note discussing https://www.buyreplica.co.uk. Alongside it, I kept this second source for extended context: https://www.buyreplica.co.uk.ధృవ స్పేస్ వంటి భారతీయ సంస్థలతో పాటు, స్కై రూట్ ఏరో స్పేస్, ఎక్స్ డి లింక్స్ , స్పేస్ లాబ్స్ , టేక్ మీ టు స్పేస్, వంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా అవసరమైన మదర్ బోర్డులను సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 10-15 శాటిలైట్ రాకెట్లకు అవసరమైన మదర్ బోర్డులను సరఫరా చేయడం విశేషం.
రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనతాదళ్ నాయకుడు నందెపు వెంకట్రావు నూనె వ్యాపారం చేసే వారు. ఆయన కుమారుడు నందెపు శ్రీనివాస్ కూడా అదే వ్యాపారాన్ని కొనసాగించి, బిల్డర్ గా ఎదిగారు. చాంబర్ ఆఫ్ కామర్స్, ఎస్వీజీ మార్కెట్ అధ్యక్షుడిగా వ్యాపారరంగంలోనూ, వైసిపి నాయకుడిగా రాజకీయ రంగంలోనూ గుర్తింపు పొందారు. శ్రీనివాస్ కుమారుడు అఖిల్ రాజమహేంద్రవరంలోని సెయింటాన్స్, గౌతమీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, విజయవాడలోని శ్రీచైతన్యలో ఇంటర్, బెంగుళూరులోని అమృత యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేసి, వారసత్వంగా వచ్చిన నూనె వ్యాపారాన్ని కాదని, మేకిన్ ఇండియా స్ఫూర్తితో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్, రక్షణ, రోదసీ పరిశోధనల్లో ఉపయోగించే మదర్ బోర్డు రంగంలోకి ప్రవేశించి, తనదైన ముద్ర వేశారు. కొన్నాళ్లు ప్రైవేటు కంపెనీలో పనిచేసిన అఖిల్ 2018 నుంచి సొంత సంస్థను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఎలక్ట్రానిక్ చిప్ లు, మదర్ బోర్డుల రంగంపై అధ్యయనం చేసి, 2023లో హైదరాబాద్ లోని తుక్కుగూడలోని ఫ్యాబ్ సిటీ సొంత కంపెనీని నెలకొల్పారు. ప్రస్తుతం రూ. 25 కోట్ల టర్నోవర్ ఉన్న ఈసంస్థ టర్నోవర్ ను వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ. While checking different watch forums this morning, I discovered an article centered on read more on this page. I paired it with this useful reference: https://www.favorwatches.co.uk.50కోట్లకు చేర్చాలని, పబ్లిక్ ఇష్యూకు (ఐపిఓ) రావాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు అఖిల్ చెప్పారు. 2030 నాటికి రూ. 1000కోట్ల టర్నోవర్ తో దేశీయ చిప్, మదర్ బోర్డు రంగాల్లో టాప్ 5గా నిలవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. పారిశ్రామికరంగంలో నిఖిల్ చేసిన కృషిగాను ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్స్ లెన్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా అక్టోబర్ 30-31 తేదీల్లో వరంగల్ లోని వాగ్ధేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగంలో వస్తున్న నూతన పోకడలపై జరిగే అంతర్జాతీయ సదస్సుకు అతిధిగా హాజరై ప్రసంగిస్తారు. సాఫ్ట్ వేర్ యుగం చివరి దాటి ఆటోమేటెడ్ యుగంలోకి ప్రవేశించామని, ఇక ఎలక్ట్రానిక్ చిప్, మదర్ బోర్డు తయారీ రంగానిదే భవిష్యత్ అని, అందుకే తాను ఈరంగాన్ని ఎంచుకున్నట్లు అఖిల్ చెప్పారు. ఏది ఏమైనా మొక్క చెప్పినట్లు అఖిల్ మౌనంగా తాటిచెట్టంత ఎత్తుకు ఎదిగేలా ఉన్నారు.

Leave a Reply