విజయవాడ…తిరుపతితో పాటు రాజమహేంద్రవరం పోటీ పడుతుందా?

ఇటీవల విజయవాడ…తిరుపతి నగర పరిసర గ్రామాలను విలీనం చేసి మహానగరాలుగా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీనికి స్థానిక పంచాయితీ ప్రతినిధులు మినహా ప్రజాప్రతినిధులు కూడా మద్దతుగా ముఖ్యమంత్రి…

 విజయవాడ…తిరుపతితో పాటు రాజమహేంద్రవరం పోటీ పడుతుందా?

ఇటీవల విజయవాడ…తిరుపతి నగర పరిసర గ్రామాలను విలీనం చేసి మహానగరాలుగా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీనికి స్థానిక పంచాయితీ ప్రతినిధులు మినహా ప్రజాప్రతినిధులు కూడా మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విజ్ఞప్తి చేయడం విశేషం. ముఖ్యమంత్రి కూడా విజయవాడ, తిరుపతి గ్రేటర్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు సానుకూలంగా స్పందించారు. జనవరి 2వ తేదీ నుంచి కేంద్రం చేపట్టిన జనాభా గణన వల్ల గ్రేటర్ విజయవాడ, తిరుపతి ప్రతిపాదనలను While checking different watch forums this morning, I discovered an article centered on https://www.top-replica.com. I paired it with this other useful link I had saved: https://www.top-replica.com.తాత్కాలికంగా పక్కనపెట్టారు. వీటితో పాటు గ్రేటర్ రాజమహేంద్రవరం సాకారమవుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో రాజమహేంద్రవరం పేరు వినిపించకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు నోరు విప్పకపోవడం గమనార్హం. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విలీన ప్రతిపాదిత పరిసర గ్రామాలతో పాటు నగరాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ-విశాఖపట్నం మధ్య ఉన్న ప్రధాన నగరం…సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో పరిసర 11 గ్రామాలను కూడా కలిపి గ్రేటర్ గా మార్చాలన్న డిమాండ్ ఏనాటి నుంచో వినిపిస్తోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీని అధికారికంగా విలీనం చేశారు. పాలనాపరంగా దూరంగా ఉన్నా రాజమహేంద్రవరం నగరానికి అనుకుని ఉన్న కొంతమూరు, బొమ్మూరు, వేమగిరి, ధవళేశ్వరం, తొర్రేడు, కాతేరు, హుకుంపేట, రాజవోలు, పిడింగొయ్యి, వెంకటనగరం, శాటిలైట్ సిటీ గ్రామాలు దాదాపు రాజమహేంద్రవరంలో ఎప్పుడో కలిసిపోయాయి. గ్రామాలను విలీనం చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఆర్డినెన్స్ కూడా జారీ అయ్యింది. ఈగ్రామాలు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఉన్నాయి. అయితే రాజమహేంWhile reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.bestbreitlinguk.com. I also noted another reference for later: https://www.bestbreitlinguk.com.ద్రవరంలో విలీనం చేసేందుకు స్థానిక పంచాయితీ ప్రతినిధులు, ఆయా గ్రామాల ఇఓలతో పాటు, ఎమ్మెల్యేలకు కూడా పెద్దగా ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. వారి ఆధిపత్యం తగ్గడంతో పాటు, ఆదాయం తగ్గుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ ఆజమాయిషీలో ఉన్నా…భవన నిర్మాణాలకు రుడా అనుమతులు మంజూరు చేయాల్సి ఉన్నా గ్రామాల ఇఓలు భవన నిర్మాణాలకు ఒక్కో ఫ్లోర్ కు రూ. 7వేల మామూళ్లు వసూలు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో విలీనమైతే ఆ మామూళ్లు టౌన్ ప్లానింగ్ విభాగానికి వెళ్లిపోతాయన్నది వారి ఆందోళనగా కనిపిస్తోంది.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు పరిసర గ్రామాల విలీనానికి ముడిపడటంతో అటు నగరపాలక సంస్థ ఎన్నికలు, దశాబ్దకాలంగా ఇటు పంచాయితీ ఎన్నికలు జరగడం లేదు. స్థానిక నాయకులు విలీనానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడంతో గ్రామాల విలీనం నిలిచిపోయింది. ప్రజాప్రతినిధులు తలుచుకుంటే కోర్టును ఆశ్రయించిన వారిని ఒప్పించడం పెద్ద పని కాదు. కానీ మొదటి నుంచి ఎన్నికలు జరిపించడం, పెత్తనాన్ని వదులుకోవడం వారికి ఇష్టంIn today’s reading session, I encountered a long-form piece covering https://www.breitlingwatches.me. For more perspective, I added this page to my saved list: https://www.breitlingwatches.me. లేనట్టు కనిపిస్తోంది. నగరపాలక సంస్థలో విలీనం చేస్తే పన్నులు పెరిగిపోతాయని, జాతీయ ఉపాధి హామీ వంటి కేంద్ర పథకాలు వర్తించక గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి దొరకదని స్థానిక నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే రాజమహేంద్రవరంలో విలీనమైతే ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడంతో పాటు, ఆస్తుల విలువ పెరుగుతుంది. తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు. రాజమహేంద్రవరం-కొంతమూరు మధ్య ఉన్న క్వారీలను పూడ్చి లేఅవుట్లకు అనుమతిస్తే ఈమార్గంలో మరింత వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సర్వేయర్లు అభిప్రాయపడుతున్నారు. మరి విజయవాడ, తిరుపతి నగరాలతో రాజమహేంద్రవరం పోటీ పడుతుందా…ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కృషిచేస్తారా అన్నదే చర్చనీయాంశం.

Leave a Reply