వాసు వ్యాఖ్యలతో గన్ని ఆశలపై నీళ్లు?!…వాసుకు ఇష్టం లేదా?…

మేయర్ సీటుపై కోటి ఆశలు పెట్టుకున్న గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కు తాజాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు ఆశనిపాతం అనడంలో సందేహం…

 వాసు వ్యాఖ్యలతో గన్ని ఆశలపై నీళ్లు?!…వాసుకు ఇష్టం లేదా?…

మేయర్ సీటుపై కోటి ఆశలు పెట్టుకున్న గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కు తాజాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు ఆశనిపాతం అనడంలో సందేహం లేదు. నూతన సంవత్సరం సందర్భంగా గన్ని కృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈఏడాది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈమేరకు తన వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు తలుచుకుంటే ఎన్నికల నిర్వహణ పెద్ద సమస్యే కాదని వ్యాఖ్యానించారు. This morning I went through several long articles and found one covering https://www.newswissrolex.me. I also checked this link to gain a wider context: https://www.newswissrolex.me.మరోవైపు రాజమహేంద్రవరం రూరల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా నగరపాలక సంస్థ ఎన్నికలపై స్పందిస్తూ విలీన గ్రామాలతో కలిపి ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అయితే తాజాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సీనియర్ నాయకుల వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించడం గమనార్హం.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై ఊహాగానాలను సాగుతున్నాయని వాసు చెబుతూ…. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదని, ఊహాగానాలు ఎప్పటికీ ఊహాగానాలు గానే ఉంటాయని స్పష్టం చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనతో పాటు, పురపాలకశాఖ మంత్రి నారాయణ, తదితరులతో సమీక్షించారన్నారు. ఎన్నికల విషయంలో స్థానిక శాసన సభ్యుడిగా తన నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని వివరించారు. కార్పొరేషన్‌ ఎన్నికల విషయంలో అందరికి త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తామన్నారు.
యువనేత లోకేష్ కోటరీలో సభ్యుడిగా, ముఖ్యమంత్రి, పురపాలక శాఖల మంత్రితో చర్చించిన వాసు As part of my research today, I looked over a helpful write‑up that mentioned https://www.nextimeuk.me. For anyone wanting further depth, this additional page may help: https://www.nextimeuk.me.వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలా…లేక సీనియర్ నాయకుల మాటలు నమ్మాలా అన్న సందేహం కలుగుతోంది. వాసు వ్యాఖ్యలను బట్టి నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే మేయర్ తో పాటు, స్థానిక కార్పొరేటర్ల పెత్తనం…పనుల పంపకాల్లో వాటాలకు వస్తారన్న ఆలోచనతోనే ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థ ఎన్నికలపై శీతకన్ను వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇదే తన చివరి పోరాటమని ఇప్పటికే గన్ని కృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. మేయర్ అభ్యర్థిగా తనకు 90శాతం అనుకూలత ఉందని ఆయన నమ్ముతున్నారు. ఈనేపథ్యంలో మేయర్ సీటు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ సహా నాయకులందరినీ కలిసిన గన్ని కృష్ణ రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Leave a Reply