కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు వీరేనా?!…

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి నగర నియోజకవర్గ పరిధిలోని 42 పాత డివిజన్లను పరిగణనలోకి తీసుకుని ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు…

 కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు వీరేనా?!…

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి నగర నియోజకవర్గ పరిధిలోని 42 పాత డివిజన్లను పరిగణనలోకి తీసుకుని ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నగరంలో తెలుగుదేశం పార్టీని ఏకచత్రాధిపత్యంగా నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసిన డివిజన్లలో రిజర్వేషన్లు కూడా దాదాపు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వల్ప మార్పులు జరిగే అవకాశాలూ ఉన్నాయి. టిడిపిలో ప్రత్యర్థి వర్గమైన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వర్గానికి చెందిన వారిని, మాజీ కార్పొరేటర్లలో చాలా మందిని పక్కనపెట్టి, తన వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారని సమాచారం. ఈసారి మాజీ కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, వాసిరెడ్డి రాంబాబు, గొర్రెల సురేష్, రెడ్డి మణి, ద్వారా పార్వతిసుందరి తదితరులను పక్కనపెట్టినట్లు తెలిసింది. బిజెపికి చెందిన కురగంటి సతీష్ కు కూడా సీటు ఇవ్వకూడదని ఎమ్మెల్యే వాసు పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఈపరిస్థితిని ముందే గుర్తించిన గోరంట్ల వర్గానికి చెందిన మజ్జి పద్మ, వాసిరెడ్డి బాబి రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ, నామవరంలలో తమ ఓట్లు నమోదు చేయించుకోవడం గమనార్హం. వీరు రూరల్ వార్డుల నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. సిటీలో వేలు పెట్టని గోరంట్ల రూరల్ లో తన వర్గీయులకు కార్పొరేటర్ సీట్లు కేటాయించుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం
1వ డివిజన్ – కడలి రామకృష్ణ, 2 – వై శ్రీనివాస్(జనసేన), 3 – కుడిపూడి సత్తిబాబు, జక్కంపూడి అర్జున్ పోటీ పడుతున్నారు. 4 – నక్కా దేవి వరప్రసాద్, 5 – యర్రా ప్రసాదరావు, 6వ డివిజన్ నుంచి మజ్జి మణికంఠ లేదా, డిప్యుటీ మేయర్ పదవి లభిస్తే ఆయన తండ్రి టిడిపి నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పోటీ చేస్తారు. 7 – జనసేన లేదా అబ్దుల్లా, 8 – వర్రే శ్రీనివాసరావు, 9 – ముసిని బాబురావు, 10 – వీరభద్రరావు, 11 – కంటిపూడి రాజేంద్ర, 12 – కిలపర్తి శ్రీనివాస్, 13 – కప్పల వెలుగుకుమారి, లేదా చెల్లుబోయిన సూర్యనారాయణ, 16- చలుమూరు సత్యనారాయణ, 21 – కొమ్మా శ్రీనివాస్, 22 – శెట్టి జగదీష్, 23 – ఇన్నమూరి దీపు, 31 – చింతా జోగినాయుడు, 34 – డాక్టర్ యాళ్ల ప్రదీప్, 35 – కరగాని వేణు, 36 – తంగెళ్ల బాబి, 37 – ఉర్లంకల లోకేష్ యాదవ్, 38 – బుడ్డిగ రవి, 39 – కేలం శ్రీనివాస్, 40 – సింహ వెంకటేష్, 41 – నందివాడ దినేష్, 42 – నామన వాసు(జనసేన), 43 – కంటిపూడి శ్రీనివాస్, 44 – జవ్వాది విజయలక్ష్మి, 45 – కొయ్యల రమణ, 46 – మొకమాటి సత్యనారాయణ, 47 – బేసరి చిన్ని, 48 – అజ్జరపు రమేష్ లేదా మరొకరు, 49 గంగాధర్, 50 – రవియాదవ్ లను అభ్యర్థులుగా ప్రాథమికంగా ఎంపిక చేశారని సమాచారం. మరోవైపు నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన 20 సీట్లు, బిజెపి 10 సీట్లు డిమాండ్ చేస్తోంది. బిజెపి సీనియర్ నాయకులు అడబాల రామకృష్ణ, బొమ్ముల దత్తు, కురగంటి సతీష్, డాక్టర్ కవికొండల శ్రీనివాస్, కాలెపు సత్యసాయిరామ్ తదితరులు పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
రేసులో డిప్యుటీ మేయర్లు…
మేయర్ సీటును బిజెపికి కేటాయించిన నేపథ్యంలో డిప్యుటీ మేయర్ పదవి కోసం టిడిపి, జనసేన పార్టీల్లో పోటీ నెలకొంది. సీనియర్ కార్పొరేటర్ వర్రే శ్రీనివాసరావుతో పాటు, మేయర్ రేసులో నిలిచి, రిజర్వేషన్ల కారణంగా వెనక్కి తగ్గిన జనసేన సిటీ ఇన్చార్జి వై శ్రీనివాస్, మజ్జి రాంబాబు డిప్యుటీ మేయర్ పదవిని ఆశిస్తున్నారు. కిలపర్తి శ్రీనివాస్ తాను కూడా డిప్యుటీ మేయర్ రేసులో ఉన్నానని చెబుతున్నారు.

———————–
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు 9491659287 నెంబర్ కు మీకు తోచిన మొత్తాన్ని ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send by phone pay to 9491659287 As your like for Encourage to us. until we get Adv.

———————–

Leave a Reply