తప్పారైటా తేల్చలేదు?! మార్గదర్శి కేసులో నైతిక విజయం ఎవరిది?!

మీడియా మొఘల్ దివంగత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్‌ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను సర్వోన్నత…

 తప్పారైటా తేల్చలేదు?! మార్గదర్శి కేసులో నైతిక విజయం ఎవరిది?!

మీడియా మొఘల్ దివంగత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్‌ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యవహారంపై పిటిషన్‌ వేయడానికి, పోరాటం చేయడానికి ఉండవల్లి ఎవరని ప్రశ్నించింది. ఈ కేసు వివరాలన్నీ పరిశీలిస్తే ఇది మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోంది తప్ప ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు గానీ, ఇతర అంశాలు గానీ కనిపించడం లేదని అభిప్రాయపడింది. అయితే చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో సంస్థకు జరిమానా తదితర సివిల్ అంశాలకు సంబంధించి ఈకేసులో వెసులుబాటును సుప్రీంకోర్టు తెరిచే ఉంచిందని ఉండవల్లి హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అంటే ఈవ్యవహారంలో సివిల్ కేసులను కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈనాడు పత్రిక నిజమే గెలిచింది అంటూ బ్యానర్ వార్తను ప్రచురించడంతో పాటు, రామోజీరావు గతంలో రాసిన లేఖను, కొంతమంది మార్గదర్శి చిట్స్ చందాదారులతో కూడిన ఇంటర్వ్యూలతో ప్రత్యేక పేజీని కేటాయించి, ఒక విధంగా సంబరం జరుపుకుంది. అయితే హెచ్ యుఎఫ్ నిర్వహిస్తున్న ఒక చిట్ ఫండ్ కంపెనీ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం తప్పా రైటా అన్న విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయలేదు.
మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు కూడా లేదన్న వాదనలను పరిగణనలోకి తీసుకుంటే 60ఏళ్లుగా మద్యం సేవించి కారు నడుపుతున్న వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయడం తప్పన్నట్లుగా ఉందని గతంలోనే పిటిషనర్ ఉండవల్లి అరుణ కుమార్ వ్యాఖ్యానించారు. రామోజీరావుపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని. కనీసం ఒక్క రూపాయి జరిమానా ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసే సంస్థలకు కాస్త భయం ఉంటుందన్నది ఉండవల్లి స్పష్టం చేశారు.
సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గతంలో ఇదే తరహా వ్యవహారాల వల్ల జైలు పాలయ్యారని గతంలోనే ఉండవల్లి గుర్తుచేశారు. తాను మార్గదర్శి వ్యవహారాన్ని బహిర్గతం చేసినప్పుడు బుక్ వాల్యూ ప్రకారం మార్గదర్శి సంస్థల ఆస్తులు రూ. 2300 కోట్లు ఉన్నాయని, ఆస్తులు జప్తు చేస్తే వీటి విలువ మరింత తగ్గే అవకాశం ఉందని ఉండవల్లి గతంలో మీడియా సమావేశంలో చెప్పారు. అంటే అప్పటికీ సంస్థ సేకరించిన డిపాజిట్లు రూ. 2500 కోట్ల కన్నా తక్కువ బుక్ వ్యాల్యూ తక్కువగా ఉందన్నమాట. మార్గదర్శి వ్యవహారాన్ని 1980 దశకంలో పెద్దఎత్తున జరిగిన బ్రాకెట్ వ్యాపారంతో పోల్చారు. దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల టర్నోవర్లో నడిచిన బ్రాకెట్ వల్ల రిక్షా కార్మికుడి స్థాయి నుంచి ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయేవారని, అది గుర్తించిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు బ్రాకెట్ ను నిషేధించారని గుర్తుచేశారు. బ్రాకెట్ పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని అయినా చర్యలు తీసుకున్నారని ఉండవల్లి గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తున్నాయి. మార్గదర్శి లాంటి సంస్థలు డిపాజిట్లు సేకరించి, తిరిగి చెల్లిస్తే తప్పులేదా?. ఈవిషయాన్ని చందాదారులు మినహా ఎవరూ ముందు జాగ్రత్తగా హెచ్చరించడానికి…ప్రశ్నించడానికి వీలులేదా?… మార్గదర్శిని మార్గదర్శకంగా తీసుకుని అగ్రిగోల్డ్, జయలక్ష్మి లాంటి సంస్థలు మళ్లీ పుట్టుకు వస్తే ఎవరు బాధ్యులు?… వంటి ప్రశ్నలను పలువురు లేవనెత్తుతున్నారు. మార్గదర్శి సంస్థల్లో చట్టవిరుద్ధ వ్యవహారాలు జరుగుతున్నాయని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అప్పటి ఆర్బిఐ గవర్నర్ గతంలో తప్పుగా ప్రకటించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈప్రశ్నల పరంపరంలో నైతిక విజయం ఎవరదన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఎపిలోని చంద్రబాబునాయుడు, తెలంగాణాలోని రేవంత్ రెడ్డి వంటి ఈనాడు మీడియా అనుకూల ముఖ్యమంత్రులు, ఎపి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్గదర్శికి కలిసి వచ్చిందని విశ్లేషిస్తున్నారు. మార్గదర్శిని తప్పుపట్టిన ఆర్బీఐ లాంటి సంస్థ కూడా ఈకేసులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వెనుక కారణాలను అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు.

———————-

మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.

Leave a Reply