సైకిల్ పై పడిన ఇండిగో విమానం!

ఉరిమి…ఉరిమి మంగళం మీద పడినట్లు ఇండిగో విమానాల సంక్షోభ వ్యవహారం తెలుగుదేశం పార్టీపై, ముఖ్యంగా పార్టీ యువనేత నారా లోకేష్ పై పడింది. ఇండిగో వ్యవహారం లోకేష్…

 సైకిల్ పై పడిన ఇండిగో విమానం!

ఉరిమి…ఉరిమి మంగళం మీద పడినట్లు ఇండిగో విమానాల సంక్షోభ వ్యవహారం తెలుగుదేశం పార్టీపై, ముఖ్యంగా పార్టీ యువనేత నారా లోకేష్ పై పడింది. ఇండిగో వ్యవహారం లోకేష్ తో పాటు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహనాయుడుకు కూడా జాతీయ స్థాయిలో తలనొప్పిగా While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.watchesetc.nl. I also noted another reference for later: https://www.watchesetc.nl.మారింది. పౌరవిమానయాన శాఖ నిబంధనలకు అనుగుణంగా పైలెట్లు, సిబ్బందిని సమకూర్చుకోలేక చేతులెత్తేసిన ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈవ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు ఇండిగో పట్ల పౌరవిమానయాన శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో బిజెపికి అనుకూలంగా ఉండే జాతీయ చానల్ రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామి చర్చావేదికను నిర్వహించారు. ఈచర్చకు హాజరైన టిడిపి దీపక్ రెడ్డి ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమ పార్టీ నేత నారా లోకేష్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, పార్టీ తరుపున వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దీంతో అసలే అరుపులు కేకలతో డిబేట్లు నిర్వహించే గోస్వామి ఈవ్యవహారంతో లోకేష్ కు, పార్టీకి సంబంధం ఏమిటని, టిడిపికి చెందిన రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని గట్టిగా నిలదీశారు.As I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on buy replica watches. To balance the viewpoint, I saved this page as well: https://www.yak.me.uk. మరోరోజు టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి హాజరుకాగా, ఆయనను కూడా అర్ణబ్ దులిపేశారు. ఇండిగో సంక్షోభంపై వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే తన ఫోన్ కూడా ఎత్తడం లేదని అర్ణబ్ అరిచారు. ఈపరిణామాలతో జాతీయ స్థాయిలో పార్టీ పరువు మంటగలుస్తోందన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టివీ చర్చను బహిష్కరించింది. దీంతో వరుసగా 3వ రోజు అర్ణబ్ గోస్వామి ప్యానల్ లో ఖాళీ కుర్చీని ప్రదర్శించి, టిడిపిని ఎద్దేవా చేశారు. తనను, పార్టీని ఇరుకునపెడుతున్న రిపబ్లిక్ టీవిని కాదని, రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో సమాధానం చెప్పడంతో పాటు, మరో జాతీయ రెండు చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. ఈఇంటర్వ్యూల ద్వారా రామ్మోహన్ నాయుడు విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చారని భావిస్తున్నారు. ఇండిగో వ్యవహారం బిజెపి అభిమాన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి ప్రయోజనం చేకూర్చేందుకేనన్న ప్రచారం జరుగుతోంది. పైలెట్ శిక్షణరంగంలోకి ప్రవేశించిన అదానీకి ఇండిగో సంక్షోభం కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. పైలెట్ల కొరత వల్లే ఇండిగో విమానాలు నిలిచిపోయిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈసంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని ఇండిగోను అదానీ కైవసం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జోస్యం చెబుతున్నారు.
ఏతావాతా ఈవ్యవహారంలో చినబాబు లోకేష్, తెలుగుదేశం పార్టీయే జాతీయ స్థాయిలో కాస్త ఇరుకున పడిందని విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో టిడిపిని ఇరుకునపెట్టిన ఈవ్యవహారాన్ని ప్రతిపక్ష వైసిపి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో టిడిపి, లోకేష్,While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.bestreplica.net. I also noted another reference for later: https://www.bestreplica.net. రామ్మోహన్ నాయుడును ట్రోలింగ్ చేస్తోంది. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈనేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ లో ఇండిగో వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆచితూచి స్పందించారు. ఈసంక్షోభాన్ని పౌరవిమానయాన శాఖ పరిష్కరిస్తుందని, రామ్మోహన్ నాయుడు తమ పార్టీకి చెందినా…ఆయన ప్రధానికి జవాబుదారీ అని వ్యాఖ్యానించడం గమనార్హం. లోకేష్ ఆధ్వర్యంలో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు దీపక్ రెడ్డి చెప్పిన మరునాడే లోకేష్ అమెరికాకు వెళ్లిపోవడం గమనార్హం. మరోవైపు ఇండిగో వ్యవహారంలో జరిగిన డామేజీ నుంచి లోకేష్ ను బయటపడేసేందుకు ఎల్లో మీడియా చర్చోపచర్చలతో పడరానిపాట్లు పడుతోంది. ఒకానొక దశలో ఇందుకు బాధ్యత వహిస్తూ అవసరమైతే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని కూడా ఎల్లోమీడియా యాంకర్లు తీర్మానించడం ద్వారా ఆయనను బలిపశువును చేసేందుకు కూడా సిద్ధం కావడం గమనార్హం.

Leave a Reply