- December 7, 2025
బాబ్రీ విధ్వంసంలో తప్పు నాదే!…బిజెపి అవిశ్వాసంపై పివి ఘాటు వ్యాఖ్యలు గుర్తు చేసిన ఉండవల్లి
బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను సవాల్ చేస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్While checking different watch forums this morning, I discovered an…
బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను సవాల్ చేస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్While checking different watch forums this morning, I discovered an article centered on https://replicaincuk.com. I paired it with this useful reference: https://replicaincuk.com. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ 6వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మేధావులు, లౌకికవాదులను ఆలోచనల్లో పడేసింది. నాడు యుపిలో కల్యాణ్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండగా….బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో జరిగిన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారని ప్రజలందరికీ తెలుసు. అదే పార్టీ బాబ్రీ మసీదు కూల్చివేతపై దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే విడ్డూరంగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై పివి ఇచ్చిన సమాధానాన్ని ఉండవల్లి మీడియాకు విడుదల చేసి, బిజెపి వైఖరిని మరోసారి ఎండగట్టారు.
పార్లమెంటులో పివి మాట్లాడుతూ….మిస్టర్ స్పీకర్, ఈ చర్చ అవిశ్వాస తీర్మానం రూపంలో జరగటమే అతి విచిత్రం. భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయింది అట.. ఎందువల్ల ? భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మటం వల్ల ! En consultant différents sites aujourd’hui, j’ai trouvé un article qui pourrait vous intéresser, notamment cette partie détaillée concernant https://www.repliquedesmontres.me. J’ai également noté une autre référence pour plus tard: https://www.repliquedesmontres.me.బహుశా ఇది భారత ప్రభుత్వానికి జరగవలసిందే అనుకుంటా..! దీని బాధ్యత నాదే ,ఇది నేను ఒప్పుకుని తీరాలి. కానీ, ఈ దేశాన్ని ఇంకెలా నడపగలం ? కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా కొనసాగగలవు ? అనుమానం ఆధారంగా నడవాలా ? లేక ఆపనమ్మకం ఆధారంగా నడవాలా ? ఎలా.. ఈ దేశాన్ని మరెలా నడపాలి ? ప్రతి విషయంలోనూ కేంద్రంతో అనేక చిక్కుముడులు పెనవేసుకు పొయిన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాతిపదిక మీద ఎలా నడుస్తాయి ? మూడు కాళ్లతో రాష్ట్రాలు పరిగెత్తగలవా !? ఒకరిని వదిలేసి మరొకరు ముందుకు పరిగెత్తుకుపోవడం సమంజసమా ? ఒక విషయమై నిత్యం ఎఫిడివిట్లు దాఖలు చేస్తూ,వాగ్దానాలు హామీలు వల్లిస్తున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం చిట్టచివరికి ఇచ్చిన హామీ విషయమై నమ్మకద్రోహం చేస్తుందని ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఎలా ఊహించగలదు ? అందుకే విధ్వంసం జరిగిన వెంటనే నేను చెప్పాను.. ఇది అనుకోకుండా జరిగిపోయిన కూల్చివేత కాదు, ముందుగా రచించుకున్న వ్యూహం ప్రకారం జరిగిన సంఘటన మాత్రమే అని ! ఉత్తరప్రదేశ్లో బిజెపి ప్రభుత్వాన్ని నమ్మినందుకు నన్ను విమర్శించారు, నిందించారు. బహుశా అది ఒక్కటే నేను చేసిన పాపం !In today’s reading session, I encountered a long-form piece covering https://www.toplevelwatch.com. For more perspective, I added this page to my saved list: https://www.toplevelwatch.com. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నినమ్మడం అనే నేరాన్ని నేను చేశానని అంగీకరిస్తున్నాను. ఆ విషయమై నేనేమీ బాధ పడను కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మటం తప్ప నాకు మరో గత్యంతరం కనపడలేదు. సుప్రీంకోర్టు కూడా ఆ ప్రభుత్వాన్ని నమ్మిన తర్వాత ఇంక వేరే మార్గం ఏం మిగులుతుంది !?
కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ! మిలటరీ ట్రూప్స్, పారా మిలటరీ బలగాలను పంపాను. రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉండమనే పంపాను. మిలటరీని మేము వాడుకోమని రాష్ట్ర ప్రభుత్వం మాకే సమయంలోను చెప్పలేదు.. వాడుకోలేదు కూడా ! మీరు పంపిన మిలిటరీని మేము వాడుకోవడం లేదన్న కళ్యాణ్ సింగ్ గారి జాబు ఇప్పటికీ నాకు ఇంకా అందలేదు !! ఆ దురదృష్ట దినాన, ‘’మిలటరీని వాడుకోండి.. మిలటరీ సహాయం తీసుకోండి.. మిలటరీ వినియోగించండి’’ అని మేము పదేపదే చేసిన విజ్ఞప్తులకు ముఖ్యమంత్రితో కూర్చున్న హోం సెక్రటరీ గారి సమాధానం ఒక్కటే.. ’’ చాలా దురదృష్టం.. ఊహించని సంఘటన.. అత్యంత దారుణం..’’ ఇవే మాటలు.!
మన రాజ్యాంగం తునాతునకలై పడి ఉంది. ఆర్టికల్356 ఏమైంది ? చిన్నాభిన్నమైపోయింది. రాజ్యాంగ నిపుణులు ఈ విషయమై ఆలోచించాలని నా కోరిక “ ఏ రాష్ట్రంలోనైనా ఒక రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన బాధ్యతలు నిర్వహించలేకపోతోందని రాష్ట్రపతి కనుగొనినప్పుడు”.. సరిగ్గా ఇలాగే వ్రాయబడింది మన రాజ్యాంగంలోని 356 అధికరణం లో ..! లెక్కలేనన్ని సార్లు ఈ ఆర్టికల్ ఉపయోగించి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయబడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తన పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలనే అనేకసార్లు రద్దు చేసింది
‘’రాజ్యాంగబద్ధంగా పరిపాలన బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు’’ అని ఆర్టికల్ 356 లోని మాటలకు ఒక చిన్న పదం చేర్చి ఉంటే ‘’ఉత్పన్నమైనప్పుడు’’కు బదులుగా ‘’ఉత్పన్నం కాగల పరిస్థితుల్లో’’ అని వ్రాయబడి ఉంటే.. కచ్చితంగా గవర్నర్ / రాష్ట్రపతికి 356 వాడే అవకాశం దొరికి ఉండేది ! ‘’ కానీ చరిత్రలో ఇదే ప్రథమం.. మన రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ మొదటిసారిగా పరీక్షకు నిలబడి ఓడిపోయింది. 356 ను ఎవరు వాడుతున్నారు ఎవరు వాడలేకపోయారు అనే చర్చను పక్కన పెట్టండి.. 356 అధికరణం లో ఉన్న ఈ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి.
ఇంటిలిజెన్స్ బ్యూరో రిపోర్టులు కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియజేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో 6వ తారీక్కి సరిగ్గా మూడు రోజులు ముందు ఉత్తరప్రదేశ్ గవర్నర్ కేంద్రానికి ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖలో ఉత్తరప్రదేశ్ లో ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టకూడదని కచ్చితంగా వ్రాయబడింది. అంతేకాదు.. రాష్ట్రపతి పాలనే విధించబడితే బాబ్రీ మసీదు రక్షణ ప్రశ్నార్థకమవుతుందని కూడా ఆ లేఖలో ప్రముఖంగా హెచ్చరించబడింది. ఇవన్నీ ఒకవైపు, విజ్ఞులు మేధావులు ఇచ్చిన సలహాలు మరోవైపు.. నేనిక్కడ ఈ మాటలు అనవచ్చో.. అనకూడదో తెలియదు ! అయోధ్యలో పరిస్థితులు అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన దశలో ఉన్నాయి. బాబ్రీ మసీదు కట్టడం ‘బందీగా’ ఉంది. ఒక ప్రక్క రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల ద్వారా ఆ మసీదును కాపాడుకునే అవకాశం ఉంది. మరోపక్క మరే చర్య చేపట్టాలన్నా సమయం చాలదు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వమే విధ్వంసం కోరుకున్నప్పుడు కట్టడం కూల్చివేయడానికి క్షణం పట్టదు ! టెన్నిస్ బంతి సైజు బాంబు చాలు.. 200 గజాల దూరం నుంచి ఆ కట్టడాన్ని పేల్చి వేయవచ్చు. అదే నేను చెప్పాను ‘’తల్లి బిడ్డను పొడిచి చంపింది.. తల్లే బిడ్డ మీద విష ప్రయోగం చేసింది’’ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. జరిగిపోయాక ఇలాంటివి తెలుస్తాయి. కళ్యాణ్ సింగ్ రాజీనామా చేశారు. కానీ అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. ఇక ఇప్పుడు చేయగలిగింది ఒక్కటే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం.. అదే చేసాం ! నా మీద కురిసిన విమర్శలు ఇతర పార్టీల వాళ్ళవి, నా మిత్రులవి.. అన్నీ భరించాను! నేను మీ ముందు కొన్ని యదార్థాలు ఉంచాలని ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. ఈ యదార్థాలన్నింటినీ మించి ఇక్కడ ఒక నమ్మకద్రోహం జరిగింది. నమ్మించి చేసిన ద్రోహాన్ని ద్రోహంగా.. ద్రోహం జరిగే వరకు ఎవరు గుర్తించలేరు ! ఒక కుట్ర జరిగింది.. జరగవలసిన అనర్థం జరిగాక ఆ కుట్ర బయటపడుతుంది ! కుట్రలు ముందే తెలిసిపోయి ఉంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, చంపబడి ఉండేవారే కాదు ! ఏ పథకము నూరు శాతం లోపరహితంగా రూపొందించబడదు. ఒక మతాతీత లౌకిక ప్రజాస్వామ్యంలో సెక్యులర్ కానీ రాజకీయ పార్టీల పాత్ర ఏమిటి ? అటువంటి పార్టీల కార్యక్రమాల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యల పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. మేధావులు నాయకులు ముందుకు రావాలి.. చాలా కాలంగా ఎలాగోలాగా నెట్టుకొచ్చాం. ఇక ఇప్పుడు పునరాలోచనే లేని ఈ శక్తుల గురించి తీవ్రంగా ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది. మత సంబంధమైన విషయాలపైనే ప్రధానంగా దృష్టి నిలిపే ఈ పార్టీ మన ముందుంది. మతసంబంధమైన విషయాలకు గాని, మతానికి గాని నేను వ్యతిరేకిని కాను. కానీ ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక మత సంబంధమైన వివాదాన్ని లేవనెత్తడం మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీన్ని చూస్తూ వదిలేయలేము.. దీనికి అడ్డుకట్ట వేయాలి. ఏకే 47 తుపాకీ పట్టుకున్న వారితో నిరాయుధులైన పార్టీ వారు ఎలా పోరాడగలరు ? ఇది సమవుజ్జి కాదు. ఒక పార్టీ వారు ‘రాముడు’ని తమ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రజా హృదయాలని ప్రతిరోజు ప్రభావితం చేస్తుంటే.. మరో పార్టీ సెక్యులర్ అయిన కారణంగా ఆపేరు ఎత్తకూడదు అని కట్టడి చేసుకుంటే.. అది సమాన ఉజ్జీల మధ్య పోటీ కానే కాదు ! నా ఉద్దేశంలో ఈ విధమైన పోటీ మన రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. రంగంలోని అన్ని పార్టీలకి సమానమైన పోటీ జరగాలి. ఎన్నికల్లో పాల్గొనాలనుకునే వారు కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాలి. ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన సిద్ధాంతాల ఆధారంగా పోరాడాలి. ఈ విషయమే మనం దృష్టి సారించిచాలి. ఇరు పార్టీలకి సమాన అంశాల మీద పోటీ ఉండాలి. రాముడు విషయం అలా ఉంచండి అంతకన్నా ప్రధానమైన, ప్రజోపకారమైన అంశాల మీద ఎన్నికలు పోరాడండి.
డిసెంబర్ 6న జరిగిన సంఘటన మూర్ఖతకు పరాకాష్ట, నమ్మకద్రోహానికి మారుపేరైన అత్యంత విషాద సంఘటన ! అతి తొందర్లో ప్రజల మనసులోంచి ఇది చెరిగిపోవాలని నేను దేవుని కోరుకుంటున్నాను. ఆ దుస్సంఘటనకు సంబంధించి మన మనసుల్లో అతి చిన్న జ్ఞాపకం మిగిలిపోయి నా.. అది ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. అందుకే నేను ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకి, ఈ పార్లమెంట్ లోని అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాను. డిసెంబర్ 6న జరిగిన ఆ సిగ్గుమాలిన చర్యను అధిగమించి ఈ దేశం జీవించగలదని, ఆ వైపరీత్యాన్ని తట్టుకుని ఈ జాతి అన్నదమ్ములు వలే కలిసిమెలిసి నిలబడగలదని, వేల సంవత్సరాలుగా ఈ ఐకమత్యం ఇలాగే నిలబడిందని… రాబోయే వేల సంవత్సరాల లో కూడా ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుందని నిరూపిద్దాం అని పివి తన ప్రసంగాన్ని ముగించారు.
ఇదే మీడియా సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ…
సనాతన ధర్మాన్ని బీజేపీనే నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. హిందుత్వం అనేది ఒక మతం కాదని ఒక సంస్కృతి అని స్పష్టం చేశారు. సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. బిజెపి సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదని, ఇతరులకు నష్టం జరగకుండా సనాతన ధర్మాన్ని ఆచరిస్తే చాలని ఎద్దేవా చేశారు. మనకి ఆరాధ్య దైవం భద్రాద్రి రాముడు , అయోధ్య రాముడు కాదన్నారు. ఆంధ్రాలో బిజెపి ఎప్పటికీ బలపడదని స్పష్టం చేశారు. అయితే ఏపీలో అధికార, ప్రతిపక్షాలు బిజెపి నియంత్రణలో ఉన్నాయని దుయ్యబట్టారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సరికాదని, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యాలు చేయకూడదన్నారు. ముఖ్యమంత్రి అవుతాడని తాను నమ్మిన పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న ఎపి సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు ఆంధ్రకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదని, అన్ని వేల ఎకరాలు రాజధాని కోసం ఎందుకనేదే తన ప్రశ్న అన్నారు. నగరాలను నిర్మించకూడదని, అభివృద్ధి చెందాలన్నారు. అమరావతి ఘోస్ట్ సిటీగా మారుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు.