గోదావరి పుష్కరాలకు ప్రైవేటు వాహనాల ప్రవేశం నిషిద్ధం?!…ఆర్టీసీ బస్సులు ఉచితం!

గత గోదావరి పుష్కరాలు, ఉత్తరప్రదేశ్ లో జరిగిన మహాకుంభ మేళా అనుభవాల దృష్ట్యా 2027 గోదావరి పుష్కరాలకు ప్రైవేటు వాహనాలను రాజమహేంద్రవరం సహా పలు గోదావరితీర ప్రాంతాల్లోని…

 గోదావరి పుష్కరాలకు ప్రైవేటు వాహనాల ప్రవేశం నిషిద్ధం?!…ఆర్టీసీ  బస్సులు ఉచితం!

గత గోదావరి పుష్కరాలు, ఉత్తరప్రదేశ్ లో జరిగిన మహాకుంభ మేళా అనుభవాల దృష్ట్యా 2027 గోదావరి పుష్కరాలకు ప్రైవేటు వాహనాలను రాజమహేంద్రవరం సహా పలు గోదావరితీర ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాల్లోకి అనుమతించకూడదన్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.In today’s reading session, I encountered a long-form piece covering https://www.gfwatches.com. For more perspective, I added this page to my saved list: https://www.gfwatches.com. స్థానికులు, ప్రముఖుల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేటు వాహనాలను శివారు ప్రాంతాల్లోనే నిలిపివేసి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో స్నానఘట్టాలకు తరలిస్తారు. ఈమేరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పుష్కరాలు జరిగే ప్రాంతాలకు 2500 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం 4లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత పుష్కరాల్లో 2.8లక్షల మందిని తరలించారు. రాజమహేంద్రవరం శివారు ప్రాంతాలైన లూథర్ గిరి, హౌసింగ్ బోర్డు కాలనీ,While checking different watch forums this morning, I discovered an article centered on https://www.replica–watches.co.uk. I paired it with this useful reference: https://www.replica–watches.co.uk. మార్గాని ఎస్టేట్స్, ధవళేశ్వరం డెక్కన్ క్రానికల్ వద్ద, బొమ్మూరు ఏఎంజి, తూర్పు రైల్వేస్టేషన్, జాతీయ రహదారిపై ఎడిబి రోడ్డు, దివాన్ చెరువు జీరో పాయింట్, కొంతమూరు, కాతేరులోని రాముడు చెరువు వద్ద తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేస్తారు. కొవ్వూరు, నిడదవోలులో కూడా తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సిటీ బస్సుల్లో యాత్రికులు, భక్తులను స్నానఘట్టాలకు ఉచితంగా చేరవేస్తారు. ఇందుకోసం 300 సిటీ బస్సులను నడుపుతారు. గోదావరి పుష్కరాలకు ప్రయాణీకుల సౌకర్యాల మొత్తం రూ. 35కోట్లతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.As I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.replica4u.com. To balance the viewpoint, I saved this page as well: https://www.replica4u.com. 2015 పుష్కరాల కన్నా 2027 పుష్కరాల ఏర్పాట్లపై ఆర్టీసీ అధిక శ్రద్ధ తీసుకుంటోంది. గత పుష్కరాలకు 3 తాత్కాలిక బస్టాండ్లను, 150 సిటీ బస్సులు మాత్రమే నడపడం గమనార్హం.

సంక్రాంతికి స్పెషల్ బస్సుల్లేవా?

ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతికి తెలంగాణాలోని హైదరాబాద్ తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో బంధువులు, స్నేహితులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రైళ్లలో రిజర్వేషన్లు 3నెలల ముందే నిండుకున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు చార్జీల దోపిడీ చేసే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో సంక్రాంతికి వచ్చే వారికి ఆర్టీసీ బస్సులపై ఆధారపడాల్సి ఉంటుంది. స్త్రీశక్తి పథకం అమలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ వద్ద కూడా చాలినన్ని బస్సులు లేవు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గత సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 301 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఒక్క హైదరాబాద్ నుంచే 157 సర్వీసులు నడిపారు. ప్రధానమంత్రి ఇ బస్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయి. అవి జిల్లాల వారీగా కేటాయిస్తే తప్ప కొత్త బస్సులు రోడ్కెక్కే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య దాదాపు 98శాతానికి చేరుకుంది. ప్రత్యేకించి మహిళల సంఖ్య 15శాతం పెరిగింది. దూర ప్రాంతాలకు కూడా మహిళలు ప్రయాసలకోర్చి పల్లె బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఆగస్టులో ప్రారంభించిన స్త్రీశక్తి పథకం కింద 3నెలలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే రూ. 400కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈబకాయిలు వసూలైతే తప్ప ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిసారించే అవకాశాలు కనిపించడం లేదు.

Leave a Reply