కూటమి కాపులు భయపడ్డారా?..
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కూటమి నేతలు వైసిపి నేతగానే భావిస్తుండటంతో ఆయన మృతి కాపుల్లో అంతర్గత చిచ్చుకు కారణంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కులం…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కూటమి నేతలు వైసిపి నేతగానే భావిస్తుండటంతో ఆయన మృతి కాపుల్లో అంతర్గత చిచ్చుకు కారణంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కులం ముఖ్యమా…పార్టీ ముఖ్యమా అంటే పార్టీయే ప్రధానం అన్న వైఖరి వారిలో కూటమి నేతల్లో కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా ముద్రగడ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్నిసందర్శించి, నివాళులు కూడా అర్పించారు. తరవాత మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్ సోదరుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో పార్టీలకు అతీతంగా వైసిపితో పాటు, కూటమి పార్టీలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టిడిపి నాయకులు వంగవీటి రాధా, గన్ని కృష్ణ, బిజెపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా విజయవాడలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ, వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చెట్టాపట్టాలేసుకుని కనిపించడం టిడిపి అధిష్టానానికి రుచించలేదు.ఈసందర్భంగా 2019లో కాపు ఉద్యమం వల్లే టిడిపి ఓటమిపాలైందన్న ఉమ వ్యాఖ్యలు కూడా టిడిపి అధిష్టానానికి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. బొండా ఉమకు టిడిపి అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ కోరింది.. రాజమహేంద్రవరం సంస్మరణ సభను పట్టించుకోని, టిడిపి అధిష్టానం ఉమ, రాంబాబు చెట్టాపట్టాలేసుకుని కూర్చుకోవడాన్ని సహించలేకపోయింది. అప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈనేపథ్యంలో తాజాగా జక్కంపూడి సోదరుల ఆధ్వర్యంలోనే ఆగస్టు 1న ముద్రగడ సొంతూరు కిర్లంపూడిలో జరిగిన సంస్మరణ సభలో ఒక్క కూటమి నాయకుడు కూడా కనిపించకపోవడం కూటమి పార్టీల్లోని కాపు నేతల్లో వచ్చిన మార్పునకు అద్దం పడుతోంది. ముద్రగడ వెంట ఉద్యమాల్లో నడిచిన ఆకుల రామకృష్ణ వంటి నాయకులు మినహా మిగిలిన టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈసభకు ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమిలోని జనసేన పార్టీ ముద్రగడ తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె జనసైనికురాలు బార్లపూడి క్రాంతి వైపు నిలవగా, బిజెపి తటస్థంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈపరిణామాలు రాజకీయంగా ఏ పార్టీకి మేలు చేస్తాయన్నది పక్కనపెడితే కాపుల్లో అనైక్యత మరోసారి కొట్టొచ్చినట్లు కనిపిస్తో్ంది.
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.