కూటమి కకావికలు…వికటించిన ఫలితాలు!…ఎమ్మెల్యే వాసుకు తొలి సవాల్!

కలిసి ఉంటే కలుగు లాభం. రాజమహేంద్రవరంలోని ఎపి పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈసామెతను విస్మరించినట్లు కనిపిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలు నష్టపోయాయి. ఎపి…

 కూటమి కకావికలు…వికటించిన ఫలితాలు!…ఎమ్మెల్యే వాసుకు తొలి సవాల్!

కలిసి ఉంటే కలుగు లాభం. రాజమహేంద్రవరంలోని ఎపి పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈసామెతను విస్మరించినట్లు కనిపిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలు నష్టపోయాయి. ఎపి పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూటమిలోని టిడిపి , జనసేన, బిజెపి పార్టీలు వేరువేరు కూటమిలో చేరి పోటీ చేయడంతో గుర్తింపునకు అవసరమైన 51శాతం ఓట్లను సాధించలేకపోయాయి. జనసేన పార్టీ కూటమి గుర్తింపును కొద్ది తేడాతో దక్కించుకోలేకపోయినా మిగిలిన కూటముల కన్నా ఎక్కువ ఓట్లు సాధించి, సత్తా చాటింది. రాజమహేంద్రవరంలోని అన్ని సహకార బ్యాంకు ఎన్నికల్లో చక్రం తిప్పి, టిడిపి అభ్యర్థులను గెలిపించి ఇప్పటి వరకు అజేయంగా నిలిచిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ఈఎన్నికల్లో నాయకత్వానికి చుక్కెదురైంది. తద్వారా ఆయనకు ఈఎన్నికలు తొలి సవాల్ ఎదురైనట్లు ఉంది. ఎన్నికల చివరి దశలో తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ కేడర్ తో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించినా ఫలితం లేకపోయింది. పేపరుమిల్లు ఎన్నికల్లో టిఎన్టీయూసి ఈఎన్నికల్లో 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా..గౌరవప్రదమైన ఓట్లను సాధించగలగడం గమనార్హం. రాజమహేంద్రవరంలోని పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజమహేంద్రవరం నాయకుల కన్నా రాజానగరం నేతలే చక్రం తిప్పడం విశేషం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జనసేన ట్రేడ్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా యూనియన్ అత్యధిక ఓట్లను సాధించడంలో తనదైన పాత్ర పోషించారు. మాజీ రాజానగరం ఎమ్మెల్యే వైసిపినేత జక్కంపూడి రాజా, మాజీ ఎపిఐఐసి చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంతో కలిసి వైసిపి కూటమికి గౌరవ ప్రదమైన ఓట్ల రాబట్టడానికి కృషిచేశారు. మాజీ ఎంపి, రాజమహేంద్రవరం వైసిపి సిటీ ఇన్చార్జి మార్గాని భరత్ రామ్ పేపరుమిల్లు వైపు ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీలు విడిగా పోటీ చేయడంతో ఎమ్మెల్యే వాసుకు కోపం వస్తుందనో ఏమో రాజమహేంద్రవరంలోనే ఉండే జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, బిజెపి నాయకులు ప్రచారానికి దూరంగా ఉండటం గమనార్హం.
ఎపిలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలో ఉండగా, ఇక్కడ మాత్రం కూటమి కకావికలమైంది. దీంతో ఈఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. పేపరుమిల్లు ఎన్నికల్లో తమ రాజకీయ పార్టీల సిద్ధంతాలకు విరుద్ధమైన పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు కలిసి పోటీ చేయడం గమనార్హం. ఐఎన్టీయుసి, వైఎస్సాసిఇయూ, సిఐటియూ, ఎస్ డబ్ల్యూ. డబ్ల్యూ. ఏ, భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసి, వైసిపి ట్రేడ్ యూనియన్, సిపిఎంకు చెందిన సిఐటియూతో కలిసి బిజెపికి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్ కూటమిగా పోటీ చేశాయి. ఏఐటియూసి, ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్, జనసేన ట్రేడ్ యూనియన్ యునైటెడ్ ఫ్రంట్ గా కలిసి పోటీ చేశాయి. గతంలో గుర్తింపు యూనియన్ గా ఉన్న టిఎన్ టియుసి, ఎస్ కె ఎస్ అనే చిన్న కార్మిక సంఘంతో కలిసి పోటీ చేసి, 3వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ గుర్తింపు ఎన్నికలలో మొత్తం 711 ఓట్లు గాను 706 ఓట్లు పోలయ్యాయి. జనసేన కూటమి అత్యధికంగా 258 ఓట్లు సాధించి తృటిలో గుర్తింపు సంఘం హోదాను కోల్పోయింది. ఐటిన్టీయూసి, వైసిపి కూటమి 228 ఓట్లతో, 220 ఓట్లతో టిడిపి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఏ కూటమికీ 51శాతం ఓట్లు రాకపోవడంతో పేపరుమిల్లు యాజమాన్యంతో చర్చలకు ఒక్కో కూటమి నుంచి ఇద్దరేసి ప్రతినిధులకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో యాజమాన్యంతో చర్చల్లో ప్రతినిధులంతా ఏకతాటిమీద నిలిస్తేనే కార్మికులకు తగిన ప్రయోజనాలు లభిస్తాయి. మరోవైపు ఈఫలితాలతో సత్తా జనసేన వచ్చే నగరపాలక, స్థానిక సంస్థలు ఎన్నికల్లో మరిన్ని సీట్ల కోసం పట్టుబట్టే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.

Leave a Reply