అంతా వచ్చారు…వారిద్దరు తప్ప! జనసేనలోనూ లుకలుకలు?!

రాజకీయంగా వైసిపి, జనసేన ప్రత్యర్థులైనా…రాజమహేంద్రవరంలో మాత్రం ఆరెండు పార్టీల మధ్య ఒక సారూప్యం కనిపిస్తోంది. వైసిపిలో ప్రస్తుత నగర ఇన్ చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్,…

 అంతా వచ్చారు…వారిద్దరు తప్ప! జనసేనలోనూ లుకలుకలు?!

రాజకీయంగా వైసిపి, జనసేన ప్రత్యర్థులైనా…రాజమహేంద్రవరంలో మాత్రం ఆరెండు పార్టీల మధ్య ఒక సారూప్యం కనిపిస్తోంది. వైసిపిలో ప్రస్తుత నగర ఇన్ చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్, జక్కంపూడి రాజా కుటుంబానికి అస్సలు పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. అదే పరిస్థితి జనసేనలోనూ కనిపిస్తోంది.While checking different watch forums this morning, I discovered an article centered on visit this source. I paired it with this useful reference: https://www.ukomegareplica.co.uk. టిడిపి, జనసేన, బిజెపి కూటమిని మరో 15ఏళ్ల వరకు ఎవరూ విడదీయలేరని ఒకవైపు జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుండగా, ఆపార్టీలోనే సఖ్యత లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజమహేంద్రవరం నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ మధ్య స్పర్థలు కొనసాగుతున్నాయి. తాజాగా అత్తి సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా మరోసారి ఈవిభేదాలు బహిర్గతమయ్యాయి. అత్తి సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పక్క నియోజకవర్గం నుంచి జనసేనకు చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తో పాటు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర సహా మిత్రపక్ష నాయకులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపినా..నగరంలోనే ఉండే సొంత పార్టీ నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ అవైపే చూడకపోవడం గమనార్హం. పలువురు టిడిపి నాయకులు అత్తికి శుభాకాంక్షలు తెలిపినా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా దూరంగా ఉండటం వై శ్రీనివాస్ ఆదిరెడ్డి వాసు ఒక జట్టుగా ఉన్నారన్న వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోంది. గతంలో రాజమహేంద్రవరం నగరంలోని తన నివాసంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, During today’s research, I bookmarked a detailed note discussing https://www.watches4u.co.uk. Alongside it, I kept this second source for extended context: https://www.watches4u.co.uk.జనసేన పార్టీ కార్యాలయంలో అత్తి సత్యనారాయణ ఒకేరోజు వేరువేరుగా విలేఖర్ల సమావేశాలను ఏర్పాటు చేయగా…నగర అధ్యక్షుడిగా వై శ్రీనివాస్ రాజానగరం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదల ముందు వరకు అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెన్షన్ లో ఉన్నారు. సినిమా పంపిణీ బాధ్యతలు తీసుకుని రాజకీయంగా రీచార్జి అయ్యారు. సత్యనారాయణ సస్పెన్షన్ లో ఉన్న సమయంలో రాజమహేంద్రవరంలో జరిగిన ప్రతీ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి చురుగ్గా తిరిగిన వై శ్రీనివాస్ సత్యనారాయణ పార్టీలో చేరగానే సత్యనారాయణకు దూరంగా ఉంటున్నారు. కనీసం ఇద్దరూ పక్కపక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడటం లేదు. మేయర్ పదవితో పాటు, రాజకీయ భవిష్యత్ కోసం పదవుల కోసం ఏర్పడిన పోటీయే వారిని దూరం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరోక్షంగా వై శ్రీనును ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఆజ్యం ఇలాగే కొనసాగితే టిడిపికి లేదా ప్రతిపక్ష వైసిపికే మేలు జరుగుతుందన్న విషయాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు గుర్తించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు జనసేన పార్టీలో జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి కందుల దుర్గేష్ బిజీగా ఉండటంతో రాలేకపోయారని చెబుతున్నారు. అయితే పార్టీలో వర్గ విభేదాలతో ఆయన వైఖరేమిటన్నది స్పష్టం కావాల్సి ఉంది.
ఒక్క రాజమహేంద్రవరమే కాదు కోనసీమ వ్యాప్తంగా కూడా జనసేనలో అంతర్గత కుమ్ములాటలతో పాటు,In today’s reading session, I encountered a long-form piece covering useful guide here. For more perspective, I added this page to my saved list: https://www.replicawatchstore.co.uk. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులతో కూడా స్థానిక జనసైనికులకు పొసగడం లేదు. అమలాపురం జనసేన 2 వర్గాలుగా కొనసాగుతోంది. రామచంద్రపురంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు, జనసేన నాయకులకు పొసగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన బోణీ కొట్టి 2వ సారి కూడా విజయాన్ని చేకూర్చిన రాజోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వైఖరి పట్ల స్థానిక జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సొంత పార్టీ కార్యకర్తలనే పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పి గన్నవరంలో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. జనసేనలో అంతర్గత లుకలుకలు, మిత్రపక్షంతో స్థానికంగా విభేదాలు ఉంటే పవన్ ఆశించిన విధంగా మరో 15ఏళ్ల పాటు కూటమి బలంగా ఉంటుందా అన్నది అనుమానమే…

Leave a Reply