• February 14, 2025

వాలంటైన్ వర్థంతి ప్రేమికుల రోజా?!

ప్రతి సంవత్సరం నేటి యువత  ఫిబ్రవరి 14 న జరుపుకునే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రియులు, ప్రియురాళ్లను ఆకట్టుకునేందుకు ఎంతో హడావుడి చేస్తుంటారు. అయితే ఫిబ్రవరి 14న వాస్తవానికి…

 వాలంటైన్ వర్థంతి ప్రేమికుల రోజా?!

ప్రతి సంవత్సరం నేటి యువత  ఫిబ్రవరి 14 న జరుపుకునే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రియులు, ప్రియురాళ్లను ఆకట్టుకునేందుకు ఎంతో హడావుడి చేస్తుంటారు. అయితే ఫిబ్రవరి 14న వాస్తవానికి ఒక ప్రియుడ్ని ఉరి తీసిన రోజు కావడం గమనార్హం.  పాశ్చాత్యుల నుంచి దిగుమతై.. భారతదేశంలో యువతను వేలం వెర్రి ఎక్కిస్తున్న వేడుక. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను, యువతను పెడదోవ పట్టించే విధంగా జరిగే ప్రేమికుల రోజును భజరంగ్‌ దళ్‌,  విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అఖిల భారతీయ విద్యా పరిషత్, శ్రీ రామ్ సేన,  స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా,  హిందూ మున్నాని, హిందూ మక్కల్ కచ్చి వంటి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలైతే  ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమజంట కనిపిస్తే వారికి అక్కడిక్కడే పెళ్లి చేసేస్తారు. దీంతో ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా పలుచోట్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని ఓ సర్వేలో వెల్లడైంది.ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రేమికుల రోజుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 14న వివిధ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2012లో ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎంగా అఖిలేశ్‌ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న మాతృ-పితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయినా శివసేన ఫిబ్రవరి 14న ‘బ్లాక్‌ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్‌ సింగ్‌కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం.   

అమెరికాకెనడా, మెక్సికో, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్ తదితర పాశ్చాత్య దేశాలతో పాటు,  జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా  జరుపుకుంటారు. ఇది ఆతరువాత ప్రపంచవ్యాప్తమైంది. తమ వ్యాపారాలకు కూడా గిరాకీ ఏర్పడటంతో వాలెంటైన్స్ డే  ను బహుళజాతి సంస్థలు, భారతదేశంలోని కొన్ని సంస్థలు కూడా ప్రోత్సహిస్తున్నాయి.  కొన్ని దేశాల్లో దీన్ని ఏడు రోజుల వేడుకగా జరుపుతారు. ఫిబ్రవరి 7: రోజ్ డే, ఫిబ్రవరి 8: ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9: చాక్లెట్ డే, ఫిబ్రవరి 10: టెడ్డీ డే, ఫిబ్రవరి 11: ప్రామిస్ డే, ఫిబ్రవరి 12: హగ్ డే, ఫిబ్రవరి 13: కిస్ డే, , ఫిబ్రవరి 14: వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు.

భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. వాలెంటైన్‌ డేకు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ ఉంటుంది. అర్జెంటీనాలో ఇక్కడ విభిన్నంగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు. కొరియాలో ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ప్రేమికులు దినోత్సవం ఉత్సాహంగా తీసుకుంటారు.

వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త  ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. 270 సంవత్సంలో  రోమ్‌ దేశంలో జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌కు అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. 

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా…..

 

 

Leave a Reply