గణతంత్ర దినోత్సవానికి…స్వాతంత్ర్య దినోత్సవాలకు మధ్య తేడా ఇదే!
ఆగస్టు 15, 1947న బ్రిటీష్ దేశ వలసపాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా జెండా…

ఆగస్టు 15, 1947న బ్రిటీష్ దేశ వలసపాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతీ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఈవిషయం చాలామందికి తెలియదు…తెలిసినా మర్చిపోతుంటారు.
గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు జాతీయ స్థాయిలో రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు.
గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి, దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు , ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అందుకే ఆరోజున గవర్నర్, కలెక్టర్ వంటి అధికారులే జెండాలను ఆవిష్కరిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే గణతంత్య్ర దినోత్సవం అధికారిక కార్యక్రమంగా జరుపుతారు. స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది.
అలాగే 2002కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాన్ని ఎగురవేయగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని జిందాల్ వాదించారు. ఈకేసును విచారించిన సుప్రీమ్‌కోర్టు ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 జనవరి 26 న అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా….