రాజమహేంద్రవరమా….రాజమండ్రా?……రైల్వేస్టేషన్ పేరు మార్చలేరా?!
రాజమండ్రి నగరాన్ని రాజమహేంద్రవరంగా మార్చి పుష్కరకాలం గడుస్తోంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల చివరి…
రాజమండ్రి నగరాన్ని రాజమహేంద్రవరంగా మార్చి పుష్కరకాలం గడుస్తోంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల చివరి రోజున ఆర్ట్స్ కళాశాల మైదానంలో సీఎం చంద్ర బాబు ప్రసంగిస్తూ.. చారిత్రక ప్రదేశాలు, చరిత్ర ఆనవాళ్లు తెలిపే పేర్లను మార్చడం సబబు కాదని.. రాజమండ్రిని ‘రాజమహేంద్ర వరం’గా పేరు మార్పు చేస్తున్నట్టు ప్రకటించారు. 2015 డిసెంబరు 22న వెలు వడిన జీవో నెం.483 ఆధారంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పేరు మా ర్పును ఆమోదిస్తూ తీర్మానించారు. రాజమహేంద్రవరానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని రాజరాజనరేంద్రుడు పాలించాడు. ఆయనకు రాజమహేంద్ర అనే బిరుదు ఉంది. దీంతో రాజమహేంద్రవరం అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. తర్వాత క్రమంలో రాజమహేంద్రిగా.. ఆపై బ్రిటిషర్ల పాలనలో వారికి నోరుతిరగక రాజమండ్రిగా రూపాంతరం చెందింది.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో పేరు మార్పు అంశం మరోసారి చర్చకు దారితీస్తోంది. 2018లో బిజెపి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లోని చారిత్రాత్మక అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ గా, మొగల్ సరాయ్ ను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ గా రైల్వేస్టేషన్లకు పేరు మార్పు చేశారు. పుష్కరకాలం గడుస్తున్నా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ పేరు రాజమండ్రిగానే కొనసాగడం గమనార్హం. రైల్వేస్టేషన్లు, ఇతర కేంద్రసంస్థల బోర్డుల్లో, అధికారిక పత్రాల్లో పేర్లు మారిస్తేనే జాతీయ స్థాయిలో పేరు మారుతుందన్నది వాస్తవం.
2015లో బిజెపి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, టిడిపికి చెందిన మాగంటి మురళీమోహన్ ఎంపిగా ఉన్నారు. రాజమహేంద్రవరంగా పేరు మారిన తరువాత నాలుగేళ్లు ఎంపిగా ఉన్నా మురళీమోహన్ రైల్వేస్టేషన్ పేరు మార్పించలేకపోయారు. ఇప్పుడు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బిజెపికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి ఎంపిగా ఉన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పురందరేశ్వరైనా రైల్వే స్టేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్పించగలరా అన్న చర్చ సాగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రైల్వేస్టేషన్ అభివృద్దికి రూ. 270కోట్లు మంజూరు చేయించినట్లు ఆమె ప్రకటించారు. అదే స్ఫూర్తితో స్టేషన్ పేరు మార్పునకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.